స్టార్ హీరోల పుట్టినరోజుని అభిమానులు తమ ఇంటి పండగలా చేసుకోవడం ఎప్పటినుంచో ఉన్న కల్చర్. అయితే గతంలో ఈహడావిడి తమ స్టార్ హీరో  పుట్టినరోజు ముందురోజున లేదంటే స్టార్ హీరో పుట్టినరోజునాడు ఇలాంటి హంగామాలు జరిగేవి. అయితే అందరికీ  టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ట్రెండ్ మారిపోయింది. 

సోషల్ మీడియా ప్రాముఖ్యత బాగా పెరిగాక హ్యాష్ ట్యాగ్ పేరిట నెల నుంచే రోజుకో డిజైన్ పోస్టర్ తో స్టార్ హీరోల అభిమానులు హడావిడి చేస్తూ 10 డేస్ టు గో లేదా 30 డేస్ టు గో అంటూ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో హోరెత్తించే  అభిమానుల సంఖ్య లక్షల్ల సంఖ్య దాటిపోతోంది. ఇది రానురాను కొత్త పుంతలు తొక్కి ఏకంగా వందల రోజుల్లో రానున్న తమ హీరోల బర్త్ డే లకు సైతం ఇప్పటి నుంచే విష్ చేసే పోకడ మొదలు కావడం హీరో సిద్దార్థ్ కు చిరాకు తెప్పించింది. 
Prabhas updated his Facebook cover with his latest look for Saaho. Photo: firdaus_prabhas_fan/Instagram
ప్రముఖ సినిమా ఇండస్ట్రీ ట్రాకర్ గా పేరున్న రమేష్ బాలా అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కు సూచికగా 100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనికి అదిరి పోయే ట్విస్ట్ ఇస్తూ సిద్దార్థ్ వచ్చే సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజుకు కూడా కౌంట్ డౌన్ పెట్టమంటూ ‘465 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి ట్వీట్ చేశాడు. హ్యాష్ ట్యాగ్స్ అనేవి థ్రిల్ ఇవ్వాలి కానీ కిల్ చేయకూడదని కొంచెం విచక్షణ పాటించమని సిద్ధు తనదైన శైలిలో క్లాసు పీకాడు. 
Prabhas Wallpapers
ఇప్పుడు ఈ విషయాలు అన్ని ప్రభాస్ అభిమానుల దృష్టికి రావడంతో సిద్దార్థ్ పై తీవ్ర అసహనంతో ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి రోజురోజుకు  విపరీత స్థాయికి చేరుతున్న హీరోల ఆరాధనకు బ్రేక్ వేయాలన్న ఉద్దేశ్యం సిద్దార్థ్ మాటలలో ఉన్నా ఆవిషయాలను అర్ధం చేసుకోలేక ప్రభాస్ అభిమానులు మాత్రం సిద్ధార్ద్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఉద్దేశం ఎంతమంచిది అయినా స్టార్ హీరోల పై కామెంట్స్ చేస్తే ట్రోలింగ్ ఎలా ఉంటుందో సిద్ధార్థ్ కు ఈపాటికి అర్ధం అయ్యే  ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: