తెలుగు డస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నందమూరి తారక రామారావు జీవిత కథ ‘ఎన్టీఆర్’ బయోపిక్.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన తండ్రిపాత్రలో నటిస్తున్నారు.   మొదట ఈ చిత్రంపై కొన్ని వివాదాలు వచ్చినా..ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటిలో షూటింగ్ జరుపుకుంటుంది.  నందమూరి తారకరామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్’లో విద్యాబాలన్ నటించడంపై అధికారిక ప్రకటన ఇది వరకే వచ్చేసింది. 

Image result for ntr biopic

బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీ నటిస్తుండటం అదనపు ఆకర్షణ. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్య కనిపించనున్నదనేది తెలిసిన విషయమే.  అయితే బాలీవుడ్ లో విద్యాబాలన్ కి ఓ ప్రత్యేకత ఉంది..ఆమెకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో లీనం అయిపోవడం. ఇండస్ట్రీలో ఆమె ఎంత సాంప్రదాయంగా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే.  అయితే క్యారెక్టర్ కోసం ఆ మద్య డర్టీ పిక్చర్ లో బోల్డ్ గా నటించిన అందరిచేత షభాష్ అనిపించుకుంది.   

Image result for ntr biopic

తనకు ఇచ్చే పాత్రగురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆ పాత్రకి సరైన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది విద్యాబాలన్.  అందుకే బసవతారకం వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు, ఆసక్తుల గురించి విద్య తెలుసుకోవడం ప్రారంభించిందట. దీని కోసం ఆమె నందమూరి కుటుంబ సభ్యులను కలిసినట్టుగా తెలుస్తోంది. 


బసవతారకం గురించి ఆమె కూతుళ్లను, కొడుకులను అడిగి తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్‌తో ఆమె ఎలా ఉండేవారు, వ్యక్తిగత ఆసక్తులు ఏమిటి?, పిల్లలతో ఎలా ఉండేవారు.. వంటి అంశాల గురించి విద్య నందమూరి కుటుంబీకులను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: