‘రంగస్థలం’ సూపర్ సక్సస్ లో చిట్టిబాబుగా నటించిన చరణ్ పాత్రతో సరిసమానంగా చరణ్ అన్న పాత్ర పోషించిన ఆది పినిశెట్టికి చాల మంచి పేరు వచ్చింది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆది పినిశెట్టి సుకుమార్ పై చాల అసహనంగా ఉన్నాడట. 
Aadi-Pinisetty
దీనికి కారణం సుకుమార్ తన డైరక్షన్ టిప్స్ అన్నీ చరణ్ కు ఇస్తూ ఆది పినిశెట్టికి ఎటువంటి సూచనలు ఇవ్వకుండా అతడు నటించిన ప్రతి సీన్ కు వెంటనే ఓకె చెప్పేవాడట సుకుమార్. ఈవిషయంలో ఆదికి సుకుమార్ పై విపరీతమైన కోపం వచ్చినా ఆ కోపాన్ని బయట పడనీయకుండా తన పాత్రను పూర్తి చేసాడు ఆది. 

అయితే ‘రంగస్థలం’ షూటింగ్ లో ఆది పినిశెట్టికి కోపం వచ్చిన సంగతి తనకు తెలుసు అని సుకుమార్ ఈమధ్య ఓపెన్ గా చెప్పాడు. ఇతడు హీరోగా నటిస్తున్న ‘నీవెవరో’ టీజర్ ను రిలీజ్ చేస్తూ సుకుమార్ ఈకామెంట్స్ చేసాడు. ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో ఆదికి తన పాత్ర విషయంలో తాను సలహాలు ఇద్దామన్నా వాటికి ఆస్కారం లేకుండా ఆది అద్భుతంగా నటించాడని అందువల్ల తాను ఆదికి ఎటువంటి టిప్స్ అందివ్వలేదు అని చెపుతూ తాను ఆది పినిశెట్టిని చిన్న చూపు చూసినట్లు ఆది భావించవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
Sukumar Latest Interview Photos09
ఆది తన మనసులోని మాటలను సుకుమార్ దగ్గర బయట పెట్టకపోయినా అతడి భావాలను గ్రహించి సుకుమార్ చేసిన కామెంట్స్ ను చూస్తూ ఉంటే సుకుమార్ మంచి దర్శకుడు మాత్రమే కాకుండా ఎదుటి మనిషి మనసులను చదవగలిగిన మనస్తత్వ శాస్త్రవేత్త అని అనుకోవచ్చు. ఇప్పటికే ఆది నటిస్తున్న ‘నీవెవరో’ టీజర్ కు మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో ఆదికి ఈ సంవత్సరం హీరోగా బ్రేక్ వచ్చే అవకాశం కనిపిస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: