తెలుగు ఇండస్ట్రీలో మహానటులు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారు.   ప్రముఖ దర్శకులు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. అయితే మహానటులు ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య భూమిక పోషించిన వారిలో ఆయన సతీమణి బసవతారకం..ఆమె పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే విద్యాబాలన్ ఏ చిత్రంలో పాత్ర పోషించినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఆ పాత్రలో లీనమైపోతారన్న టాక్ ఉంది.  ఈ నేపథ్యంలో ఆమె బాలకృష్ణ ఇంటికి రావడం..బసవతారకం గురించిన వివరాలు కుటుంబ సభ్యులతో చర్చించడం జరిగిందట. 

తమ ఇంటికి వచ్చిన ఆమెను బాలయ్య, ఆయన భార్య వసుంధర, కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్, సోదరి లోకేశ్వరిలు సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు చీరను బహూకరించారు. ఇలా తమ ఇంటికి వచ్చిన విద్యాబాలన్ కి చీర బహుకరించి తెలుగు సాంప్రదాయాన్ని చాటుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: