తెలుగు ఇండస్ట్రీలో హీరో నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ‘దిల్’ చిత్రం మంచి విజయం సాధించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత దిల్ రాజ్ తో ‘శ్రీనివాస్ కళ్యానం’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్.   శతమానం భవతి సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు.  దిల్ చిత్రం విడుదలైన 15 ఏళ్ల తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి దిల్ రాజే నిర్మాత. ఆగష్టు 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
Image result for nithin srinivasa kalyanam movie
ఈ ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు.  అదే సమయంలో ఆడియో వేడుక తేదీని కూడా ప్రకటించనుండడం విశేషం. 
వివాహ బంధం గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉండనుంది.  ‘మనం పుట్టినపుడు చాలామంది సంతోషిస్తారు..అది మనకు తెలియదు..మనం దూరమైనపుడు మనవాళ్లందరూ బాధపడతారు..అదీ మనకు తెలియదు’. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి..మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే..అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ ‘శ్రీనివాస కళ్యానం’ అంటూ జయసుధ వాయిస్ ఓవర్ తో ముగుస్తుంది. 

Image result for nithin srinivasa kalyanam movie

నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నందిత శ్వేతా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: