‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన రాజమౌళి క్రేజ్ ఈమూవీ విడుదలై   సంవత్సరం గడిచిపోయినా ఇంకా తగ్గడంలేదు. ఈమూవీకి సంబంధించి రాజమౌళికి ఇంకా అవార్డులు గౌరవాలు దక్కుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈమధ్య చెన్నైలో జరిగిన బిహైండ్ ఉడ్స్ అవార్డుల కార్యక్రమంలో ఏవీయం గోల్డ్ మెడల్ ఫర్ ది విజనరీ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును అందుకుంటూ జరిగిన ఫంక్షన్ లో రాజమౌళి తన భార్య రమా రాజమౌళిని ఎవరికీ తెలియని పిలుపుతో పిలిచి అందరికీ షాక్ ఇచ్చాడు.
బాహుబలి చిత్రంతో చరిత్ర
ఈ ఫంక్షన్ లో వేదిక పైకి  రాజమౌళిని ఆహ్వానించగానే కోలీవుడ్ స్టార్స్ తో నిండిపోయిన ఆ ఫంక్షన్ ఆడిటోరియం అతిధుల చప్పట్లతో హోరెత్తిపోయింది. స్టాండింగ్ ఒవేషన్ తో కోలీవుడ్ ప్రముఖులు అంతా జక్కన్న పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. 
నాన్న పేరిట అవార్డును రాజమౌళికి
ఈ అవార్డును ప్రఖ్యాత దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ అందజేశారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ అవార్డును జక్కన్న అందుకోబోతున్న సందర్భంగా వేదికపై రాజమౌళి సతీమణి రమా రాజమౌళిని కూడా ఆహ్వానించారు. దానితో ‘చిన్ని’ వేదికపైకి రా అని రమా రాజమౌళిని జక్కన్న కోరడంతో రాజమౌళి భార్య రమా రాజమౌళి ముద్దు పేరు అందరికీ తెలిసి అద్బుతమైన స్పందనను ఆడియెన్స్ ఇచ్చారు. 
 గేట్ కీపర్ ఆపిన చోటే అవార్డు
ఈ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ తన జీవితంలో తొలిసారి ఏవీఎం స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు చేసుకుంటూ తాను చాల సంవత్సరాల క్రితం  అటూ ఇటూ చూస్తూ ఏవీఎంలో అడుగుపెడుతుండగా గేట్ కీపర్ తనను ఆపిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అటువంటి చోటనే తనకు ఏవీఎం అధినేత పేరుతో అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది అంటూ రాజమౌళి కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ఈకార్యక్రమంలో పాల్గొన్న అనేకమంది కోలీవుడ్ ప్రముఖులు రాజమౌళిని ఇండియన్ సినిమా ప్రతిష్టగా అభివర్ణించడం ఇక్కడి ట్విస్ట్. ఇన్ని సత్కారాలు గౌరవాలు తనకు వస్తున్నాయి కాబట్టే రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ కథ విషయంలో అంత కన్ఫ్యూజ్ అవుతున్నాడనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: