టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తూ ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ సెలెబ్రెటీ. మొదటి సినిమాతోనే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లిస్టులో స్థానం పొందిన ఈ యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని ఎందరో నిర్మాతలు మరెందరో హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. 
ajay bhupathi created new era in tollywood industry
ప్రస్తుతం ‘ఆర్ ఎక్స్ 100’ సక్సస్ ఎంజాయ్ చేస్తున్న అజయ్ భూపతి ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోల మైండ్ సెట్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. చాలామంది హీరోలు దర్శకులను తమ వద్దకు పిలిపించుకుని చేస్తున్న పొరపాట్ల పై కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. 
నేటివిటితో ప్రేమ కథ
చాలామంది హీరోలు దర్శకులు చెపుతున్న కథలను తాము వినకుండా ముందుగా వారి మేనేజర్లకు పిఎ లకు కథను వినిపించమని చెపుతున్నారని కథను అర్ధం చేసుకునే శక్తి హీరోలకు ఉంటుంది కాని వారి దగ్గర పనిచేసే పిఎ లకు మేనేజర్లకు ఎక్కడ ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నాడు అజయ్ భూపతి. ప్రస్తుతం చాలామందికి హీరోలకు ఉన్న ఈ మైండ్ సెట్ వల్లనే మంచి కథలు హీరోల దగ్గరకు చేరలేకపోతున్నాయని ఇలాంటి అలవాట్లు హీరోలు మార్చుకోలేకపోతే హీరోల కెరియర్ కే నష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఈ సంచలన దర్శకుడు.

ఇదే సందర్భంలో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ప్రేమలో తనకు చాల షాక్ లు తగిలాయని ఆ షాక్ లు నుంచి తేరుకున్నాక నన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి తన మరదలే అన్న విషయాన్ని చాల ఆలస్యంగా తెలుసుకుని చివరకు తన చుట్టాల అమ్మాయిని వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. తనకు ప్రభాస్ దూరపు చుట్టం అన్న విషయాన్ని కూడ బయటపెడుతూ తన ముక్కు ప్రభాస్ ముక్కులా ఉంటుంది అని చాలామంది అంటారని అయితే ఇప్పటి వరకు తాను ఎప్పుడు ప్రభాస్ ను కలవలేదు అంటూ హీరోలు మారకపోతే వారికి మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి కూడ నష్టమే అంటూ ఇది తాను వారికి ఇస్తున్న సూచన అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు అజయ్ భూపతి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: