‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ సక్సస్ తో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన పాయల్ రాజ్ పుత్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాలామందికి తెలియని విషయాలను షేర్ చేసుకుంది. తాను ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయినా తనకు స్టార్ డమ్ కొత్త కాదని తాను గత 5 సంవత్సరాలుగా హిందీ టివి సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తూ పంజాబీ భాషలో ప్రస్తుతం చాల సినిమాలు చేస్తూ బీఎండబ్ల్యూ కార్లలలో తిరుగుతున్న హీరోయిన్ స్టేటస్ తనది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Payal Rajput
ఇదే సందర్భంలో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తీసిన ఆత్రేయపురంలో చిన్నచిన్న హోటల్స్ లో ఉంటూ తాను పడ్డ కష్టాల గురించి వివరిస్తూ తాను రెండేళ్ళ క్రితం ఒక సన్నిహిత వ్యక్తి ప్రభావం వల్ల ఆధ్యాత్మికంగా మారానని స్పిర్చ్యువల్ నేచర్ లేకుంటే తాను ఆత్రేయపురం లాంటి చిన్న ఊరిలో అన్నిరోజులు ఉండలేకపోయేదాన్ని అన్న విషయాన్ని వివరించింది. ఆత్రేయపురం దగ్గర దొరికే రొయ్యలు పీతలు తినాలని ఉన్నా తాను ప్రస్తుతం తన జీవితంలోకి వచ్చిన అతడి సూచనలతో నాన్ విజ్ మానేసిన నేపధ్యంలో తను బ్రతకడం కోసం మరో ప్రాణిని చంపడం అవసరమా ? అన్న ఆవ్యక్తి ఇచ్చిన సలహాలు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి అని అంటోంది పాయల్ రాజ్ పుత్. 

అయితే ప్రస్తుతం తన జీవితంలోకి వచ్చిన అతడు ఎవరు అన్నది ప్రస్తుతం తాను బయటపెట్టను అనీ తన దృష్టి అంతా తెలుగు నేర్చుకోవడంలోను తెలుగులో ఎక్కువ సినిమాలు చేసే విషయమై ఆలోచనలు చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది. అదేవిధంగా తనకు బాగా పారితోషికం వస్తుందనీ వయసులో అంకుల్స్ లాంటి వాళ్ళతో తాను నటించను అంటూ తన దృష్టి అంతా యంగ్ హీరోలు మాత్రమే అన్న సంకేతాలు ఇస్తోంది పాయల్ రాజ్ పుత్.

ఈమె ఈ ఇంటర్వ్యూలో ఇచ్చిన లీకులను బట్టి చూస్తుంటే ఇప్పటికే ఈ గ్లామర్ బ్యూటీ ఒక వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రేమ వీరిద్దరి పెళ్లి వరకు వెళుతుందా లేదా అన్న విషయమై క్లారిటీ లేకపోయినా మరో వ్యక్తి ప్రేమలో తాను ఉన్నాను అంటూ స్వయంగా పాయల్ లీకులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: