తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు ప్రిన్స్ మహేష్ బాబు.  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మహేష్ బాబు ఈ మద్య కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనేనేను’ బ్లాక్ బస్టర్ విజయంతో హ్యపీమూడ్ లో ఉన్నారు.  అంతే కాదు ఈ చిత్రం మహేష్ కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘బ్రహోత్సవం’ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. 

 శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన కాజల్ .. సమంత .. ప్రణీత కథానాయికలుగా నటించారు. భారీ తారాగణం కనువిందు చేసినా .. కథాకథనాల పరంగా ఈ సినిమా పేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.  ప్రస్తుతం మహేష్ కి తమిళనాట మంచి క్రేజ్ ఉంది. దాంతో ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' సినిమాను అక్కడ 'అనిరుధ్' అనే పేరుతో విడుదల చేయనున్నారు.
Image result for mahesh babu brahmotsavam
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మిక్కీ. జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తమిళనాట భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: