తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.   ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో మంచి విజయం అందుకున్న సాయిధరమ్ తేజ్ తర్వాత సుబ్రమాణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు.  గత కొంత కాలంగా తేజూకి బ్యాడ్ టైమ్ మొదలైంది. వరుస డిజాస్టర్లతో సతమతమవుతోన్న తేజూకు....`తేజ్ ఐ లవ్ యూ `రూపంలో మరో భారీ డిజాస్టర్ ఎదురైంది. విలక్షణ దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తేజూకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Image result for sai dharam tej tej i love

తిక్క - విన్నర్ - జవాన్ - ఇంటిలిజెంట్ - తేజ్ ఐ లవ్ యూ....ఇలా వరుసగా 5 డిజాస్టర్లతో తేజూ డీలా పడ్డాడు. జూలై 6న విడుదలైన ఈ సినిమా పవన్ తొలిప్రేమ విడుదలైన జూలై 24 నాటికి థియేటర్లలో కనిపించకుండా పోయింది.  రూ.16 కోట్ల థియేటరికల్ రైట్స్‌కి అమ్ముడుపోయిన తేజ్ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4.2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను మాత్రమే రాబట్టిందని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల్లో ఈ మూవీ రూ.3.77 కోట్లు రాబట్టింది.

Image result for sai dharam tej tej i love

నెగెటివ్ టాక్ రావడంతో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.98 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 25 శాతం మాత్రమే వెనక్కు రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న తేజూ.. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. తర్వాతి చిత్రం హిట్ కాకపోతే మాత్రం కష్టమే.  తదుపరి చిత్రంతోనైనా తేజ్ సక్సెస్ బాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

ఏరియావైజ్ కలెక్షన్లు : 
 
నైజాం         0.80 కోట్లు
సీడెడ్         0.70  కోట్లు
ఉత్తరాంధ్ర    0.60  కోట్లు
గుంటూరు   0.42  కోట్లు
ఈస్ట్           0.34  కోట్లు
వెస్ట్           0.33  కోట్లు
కృష్ణా          0.37  కోట్లు
నెల్లూరు      0.16  కోట్లు
ఏపీ -టీఎస్  3.72 కోట్లు
ఆర్ వోఐ     0.30  కోట్లు
ఓవర్సీస్     0.20  కోట్లు
వరల్డ్ వైడ్    4.22  కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: