గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు నటిస్తున్న ఏ ఒక్క సినిమా భారీ విజయాన్ని అందుకోలేక పోయాయి.  స్టార్ హీరోల చిత్రాలు పక్కన బెడితే నాని, రాజ్ తరుణ్, నితిన్, సాయిధరమ్ లాంటి హీరోలు వరుసగా ఫ్లాపులు మూటగట్టుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి ఒక్కటి మాత్రమే రిలీజ్ అవుతుంటే..యంగ్ హీరోల సినిమాలు మాత్రం రెండు రిలీజ్ అవుతున్నాయి.  హీరో నాని విషయానికి వస్తే..భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుసగా విజయాలు తన ఖాతలో వేసుకుంటూ వచ్చాడు..కానీ కృష్ణార్జున‌యుద్ధం చిత్రంతో నాని విజ‌య‌ప‌రంప‌ర‌కు బ్రేక్‌ప‌డింది. 
Image result for manchu heros
అయితే వరుస సక్సెస్ లే మనోడికి ధైర్యాన్ని ఇవ్వడంతో కథ విషయంలో నిర్లక్ష్యం చేసినట్లు వార్తలు వచ్చాయి.  చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు అనుకున్న సమయంలో వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన లవర్ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇక మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తో దూసుకుంటూ వచ్చి ‘సుప్రీమ్’ తో సెన్సేషన్ హిట్ కొట్టాడు.  అంతే ఆ తర్వాత వచ్చిన   సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. 

Image result for raj tarun

మ‌రో యువ‌హీరో నితిన్‌ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా సరైన హిట్ లేక నానా బాధలు పడుతున్నారు.  కానీ హీరోగా మాత్రం ఎక్కడా డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నాడు. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌యిందే చిత్రాల‌తో తిరిగి పుంజుకున్నారు. తర్వాత అఆ విజ‌యంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు.   ప్రస్తుతం దిల్ రాజు సంస్థలో ‘శ్రీనివాస కళ్యానం’ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

ఇక కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజ‌యంతో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ట్టుకున్నాడు రాజ్‌త‌రుణ్‌.  ఇక మంచు హీరోలు ఒక్క సక్సెస్ లేకుండా బరిలో లేకుండానే పోయారు. అయితే ఈ యువ హీరోలు అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాల్సింది పోయి సరైన కథాకథనం లేని సినిమాల్లో నటించడం వల్ల..ప్రయోగాత్మక సినిమాల్లో నటించడం వల్ల సక్సెస్ అందుకోలేక పోతున్నట్లు ఫిలమ్ వర్గాలు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: