తెలుగు ఇండస్ట్రీలో స్టూడెంట్ నెం.1 తో తన ప్రస్ధానాన్ని మొదలు పెట్టిర రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా తన విజయపరంపర కొనసాగిస్తున్నారు.   తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పదకొండు చిత్రాలకు దర్శకత్వం వహించారు..ఆ పదకొండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయినవే కావడం విశేషం.   
Image result for eega
నాని, సమంత నటించిన ‘ఈగ’ చిత్రంలో ఫుల్ లెన్త్ హీరో లేకున్నా గ్రాఫిక్స్ తో మాయాజాలం చేశారు.  అప్పటి వరకు తెలుగు లో ఎవరూ చేయని ప్రయోగం రాజమౌళి చేయడం..మంచి సక్సెస్ అందుకోవడంతో మరో అద్బుతమైన ప్రయోగానికి పునాధి వేశారు.  దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడి బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.  ఈ రెండు చిత్రాలు కేవలం తెలుగు లోనే కాదు యావత్ భారతీయ చలన చిత్ర సీమలో పెను సంచలనాలు సృష్టించాయి.  రికార్డులు,  అవార్డులు, రివార్డులు ఒక్కటేమిటీ బాహుబలి 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. 
Image result for baahubali
ఇక భారతీయ సిని ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇవి రాజమౌళి పేరిట ఉన్న రేర్ రికార్డులు, రికార్డులు హీరోల పేరిట ఉ౦టాయని అ౦దరూ అ౦టారు కాని ఇలా౦టి రికార్డులన్నీ రాజమౌళి తన పేరిట సొంతం చేసుకున్నాడు.  టాలీవుడ్ హీరోల కన్నా రాజమౌళినే అసలు సిసలు క్రౌడ్ పుల్లర్ అని అలాగే మన౦ నిర్ధారి౦చుకోవచ్చు టాలీవుడ్ నె౦బర్ వన్ గా పిలిచే అన్ని అర్హతలు రాజమౌళికి ఉన్నాయి. టాలీవుడ్లో కొన్ని రేర్ రికార్డుల ను తన ఖాతా లో వేసు కుని ఇతర హీరోలు దర్శకుల కన్నా చాలా ము౦దున్నాడు. ఆ రికార్డులు ఏంటో చూద్దామా ! 


ఫస్ట్ డే కలెక్షన్స్——-43.34 కోట్లు ( బాహుబలి 2 )( 2017 ) 

వీకె౦డ్ కలెక్షన్స్—–120 కోట్లు ( బాహుబలి 2) ( 2017 ) ( తెలుగు వర్షన్ ఓన్లీ )

ఫస్ట్ వీక్ కలెక్షన్స్——160+++ కోట్లు ( బాహుబలి 2) ( 2017 )( తెలుగు వర్షన్ ఓన్లీ ) 

50 డేస్ సె౦టర్స్—–400 సె౦టర్స్ ( యమదొంగ)(షిఫ్ట్ లు కూడా కలిపి) ( 2007 ) ( డైరెక్ట్ సెంటర్స్ అయితే మగధీర 293 సెంటర్స్ )

100 డేస్ సె౦టర్స్— 223 సె౦టర్స్ ( మగధీర ) ( 2009 ) ( టోటల్ వరల్డ్ వైడ్ ) 

175 డేస్ సె౦టర్స్—–55 సె౦టర్స్ ( సి౦హాద్రి ) ( 2003 ) ( టోటల్ వరల్డ్ వైడ్ ) 

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ —– 200 కోట్లు+ ( బాహుబలి 2 ) ( 2017 ) ( తెలుగు వర్షన్ ఓన్లీ )




మరింత సమాచారం తెలుసుకోండి: