బుల్లితెరపై ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్ నడుస్తుంది.  నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పుడు మంచి రసవత్తరంగా నడుస్తుంది. 47వ ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్ ఎంపిక, తనీష్ - కౌశల్ మధ్య కెప్టెన్ టాస్క్‌లో వాదన, బాబు గోగినేని - గీతా మధురి మధ్య సిరియస్  డిస్కషన్‌ జరిగింది. కెప్టెన్ టాస్క్ ఎంపికలో భాగంగా తొలిత బిగ్ బాస్ హౌస్‌‌కి పాన్ షాప్‌ను రప్పించారు బిగ్ బాస్. ఈ పాన్ షాప్ యజమానురాలిగా పూజా రామచంద్రన్‌ను నియమించారు బిగ్ బాస్. 


ఈ టాస్క్ ప్రకారం పాన్ షాప్ యజమానురాలుగా ఉన్న పూజాను మెప్పించాలని, అలా మెప్పించిన వారిలో ఇద్దరు అబ్బాయిలను, ఇద్దరు అమ్మాయిలను పూజా ఎంపిక చేస్తుందన్నారు బిగ్ బాస్.  వారిలో గీతామాధురి, దీప్తి, సామ్రాట్,అమిత్. ఈ టాస్క్ ప్రకారం ఒంటికి పెయింట్ వేసుకుని స్టూల్‌పై కదల కుండా నిలబడాలని ఎవరైతే కదలకుండా కిందకు దిగకుండా చివరి వరకూ ఎవరు నిలబడతారో వాళ్లే ఈ వారం కెప్టెన్ అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. 
అయితే ఈ టాస్క్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్లను స్టూల్ పై నుండి దించడానికి ఏమైనా చేయొచ్చని చెప్పారు  బిగ్ బాస్.


హోరా హోరీగా సాగిన కెప్టెన్‌ పోరులో గీతా మధురి రెండో సారి హౌస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ కెప్టెన్ ఎంపిక హౌస్‌లో వివాదంగా మారింది.  దీప్తిని స్టూల్ నుండి కిందికి దింపే క్రమంలో బాబు గోగినేని ఆమెపై బకెట్‌తో వాటర్ కొట్టారు.ఆ క్రమంలో బకెట్ ఆమెకు తాకడంతో కిందకు పడింది దీప్తి.  


తర్వాత అమిత్ కూడా డ్రాప్ అయ్యారు.   కౌశల్.. బకెట్ ఆమెకు తగలడం వల్లే ఆమె కిందికి దిగిందంటూ సామ్రాట్‌ను బలవంతంగా కిందికి తోసేశాడు. దీంతో గీతా మాధురి ఒక్కరే ఫైనల్ వరకూ నిలవడంతో ఆమె ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కొత్త కెప్టెన్‌గా ఎంపికైన గీతా మాధురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు గోగినేని. తాను బకెట్‌తో వాటర్ మాత్రమే పోశానని, బకెట్ టచ్ కాలేదంటూ వాదించారు బాబు. 


దీంతో గీతా మాధురి కల్పించుకోవడంతో ఆగ్రహంతో ఆమెపై ఊగిపోయారు బాబు. అయితే సామ్రాట్ అవ్వాలి? లేదంటూ దీప్తి అవ్వాలి ఈ వారం కెప్టెన్. మీరు కెప్టెన్ కావడం కరెక్ట్ కాదు. కౌశల్.. సామ్రాట్‌ను బలవంతంగా తోయడం వల్లే మీరు కెప్టెన్ అయ్యారు అంటూ వాదించారు. 

దీనికి గీతా మాధురి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. నేను మీకు నచ్చకపోతే నామినేట్ చేయండి. నానికి కంప్లైంట్ చేసుకోండి? లేదంటే ఏమైనా చేసుకోండి? నా ఇష్టం వచ్చినట్టు ఉంటా మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దాంతో వీరిద్దరి మద్య వాగ్యుద్దం ఓ స్థాయిలో ఉండటం ఆసక్తి రేపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: