శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన 'ధడక్' సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో జాన్వీతో పాటు కపూర్ ఫ్యామిలీ పట్టరానంత సంతోషంతో ఉంది. ఆమె ఈ మధ్య ఎక్కడ కనిపించినా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. ‘ధడక్’ సినిమాలో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించింది జాన్వీ కపూర్.
కాలేజీ స్టూడెంట్ పాత్రలో, రాజస్థానీ స్టైల్ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ఎక్కడా గ్లామర్, ఎక్స్పోజింగ్ల జోలికి వెళ్లకుండా తొలి సినిమాలో జాన్వీని అందంగా చూపించడం మీదే శ్రద్ధపెట్టారు. కాగ, ధడక్ మూవీ ప్రమోషన్స్ నుంచి ఆమె, స్టయిల్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరాఠి సినిమా సైరత్‌కు రీమేక్‌గా ధడక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది.
తాజాగా ఈ అమ్మడు ‘ఫిల్మ్‌ఫేర్’ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రుగుల జీన్స్‌లో అందంగా కనిపించడంతో పాటు ఈ సారి హాట్‌గా కూడా కనిపించింది జాన్వీ. ఈ ఫొటో షూట్‌తో గ్లామరస్ టచ్ ఇచ్చింది. గ్లామరస్ పాత్రలకు కూడా తను సై అనే సిగ్నల్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.