‘బాహుబలి’ రేంజ్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రభాస్ చాల కష్టపడి నటిస్తున్న ‘సాహో’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం లీక్ అయింది. ఇప్పటివరకు ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం 30 శాతం మాత్రమే పూర్తి అయింది అని అయితే ఖర్చు మాత్రం 120 కోట్ల రేంజ్ ని దాటిపోయిందని ‘సాహో’ నిర్మాతలు లీకులు ఇస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్‌లో సాహో
దీనితో ‘సాహో’ షూటింగ్ పూర్తి అయ్యేసరికి ఈమూవీ బడ్జెట్ 300 కోట్లకు దాటిపోతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చరిత్ర సృష్టించిన రాజమౌళి ‘బాహుబలి’ కి సంబంధించిన 2పార్ట్ లను 350 కోట్ల ఖర్చుతో తీసిన పరిస్థుతులలో ‘సాహో’ పై ఇలాంటి ఖర్చు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. 
 అక్టోబర్‌లో టీజర్.. మార్చిలో
అయితే ‘సాహో’ ఖర్చుకు సంబంధించిన వార్తలు వాస్తవమా ? లేకుంటే భారీ రేట్లకు మార్కెట్ చేయడానికి ఇలాంటి లీకులు ఇస్తున్నారా అన్న అనుమానాలకు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న నేపధ్యంలోప్రభాస్ కు సంబంధించిన రెండు సెంటిమెంట్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. 
దేశవ్యాప్తంగా విడుదలకు
 ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈమూవీ టీజర్ ను అక్టోబర్ లో వచ్చే ప్రభాస్ పుట్టినరోజునాడు విడుదల చేసి ఇక అక్కడ నుండి ఈమూవీ పై మరింత క్రేజ్ ను తీసుకు రావడానికి ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను చాలముండుగానే ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ విడుదలైన ఏప్రియల్ లో ‘సాహో’ ను విడుదల చేసి ఈసినిమాకు ‘బాహుబలి’ సెంటిమెంట్ కూడ కలిసి వచ్చేలా చూడాలని భావిస్తూ ఈమూవీ ఏప్రియల్ చివరి వారంలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని దేశవ్యాప్తంగా ఈసినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ పెట్టిన భారీ బడ్జెట్ ను ‘బాహుబలి’ సెంటిమెంట్ ఏమి చేస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: