టాలీవుడ్‌ సీనియర్‌ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నపూర్ణ ఇంటిలో శనివారం ఉదయం ఫ్యాన్‌కి ఉరిపెట్టుకుని బలన్మరణానికి పాల్పడ్డారు కీర్తి. మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఓ యువకుడితో కీర్తి వివాహం జరిగింది.

అయితే వివాహం అనంతరం భర్తతో విభేదాల కారణంగా ఆమె హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు.  అయితే కీర్తి అనారోగ్య కారణాలతోనే చనిపోయినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ప్రస్తుతం కీర్తి డెడ్ బాడీని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూతురి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అన్నపూర్ణ. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: