పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో పవన్ వీరాభిమానుల సహాయం ప్రస్తుతానికి సరిపోకపోయినా బుల్లితెర క్రేజీ రియాలిటీ షోగా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘బిగ్ బాస్ 2’ షోలో పాల్గొంటున్న సెలెబ్రెటీల భవితవ్యాన్ని పవన్ అభిమానులు శాసిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఈరోజు ప్రసారం కాబోతున్న ‘బిగ్ బాస్ 2’ షోలో సామాన్యుడి కేటగిరి నుంచి వచ్చిన నూతననాయుడు రీ ఎంట్రీ అని అంటున్నారు.
ఓటింగ్ పూర్తయిన తర్వాత
మొన్న శుక్రువారంతో ముగిసిన ‘బిగ్ బాస్’ ఓటింగ్ ప్రక్రియలో ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయిన నూతననాయుడు తిరిగి రీ ఎంట్రీ కావడానికి మార్గాన్ని సులువు చేస్తూ లక్షల సంఖ్యలో నూతననాయుడుకు ఓట్లు వచ్చాయి అన్న లీకులు వస్తున్నాయి. ‘బిగ్‌ బాస్’ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఎలిమినేట్ అయిన సెలబ్రిటీలను తిరిగి మళ్లీ వెనకకు రప్పించే ఓటింగ్ ప్రక్రియలో నూతన నాయుడు విజేతగా నిలిచాడు అన్న వార్తలు రావడంతోపాటు నిన్న శనివారం ఉదయం నుంచే నూతన్ నాయుడు నెటిజన్లతో లైవ్‌ లో మాట్లాడుతూ జోష్‌ లో కనిపించడంతో నూతన నాయుడు రీ ఎంట్రీ ఖరార్ అయింది అన్న వార్తల హంగామా మొదలైంది. 
బాబు సంగతి చూస్తా
నూతన నాయుడు ఉద్వేగానికి గురి అవుతూ పవన్ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెప్పడం బట్టి ఇతడి రీ ఎంట్రీకి పవన్ అభిమానులు ఏవిధంగా కృషి చేసారో అర్ధం అవుతుంది. గతంలో ఇతడు ‘ప్రజారాజ్యం’ లో పనిచేసిన నేపధ్యంతో పాటు పవన్ కళ్యాణ్ పై తన విపరీతమైన భక్తిని చాటుకుంటూ ఈమధ్య అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రభావంతో పవన్ ఫ్యాన్స్ నూతన నాయుడును అసామాన్యుడుగా మార్చి ఈవిధంగా లక్షల సంఖ్యలో ఓట్లు వేసారని తెలుస్తోంది. 
పవన్ ఫ్యాన్స్ అండ
దీనికితోడు ఇతడి రీ ఎంట్రీ వెనుక సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు కూడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా నూతన నాయుడుకు ఈవిధంగా ఓట్లు పడే విషయమై సుమారు 40 లక్షల మేరకు ఒక అజ్ఞాత వ్యక్తి ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి. గతంలో జరిగిన ‘బిగ్ బాస్ 1’ షోలో శివబాలాజీ ‘బిగ్ బాస్’ షో విజేతగా మారడానికి పవన్ అభిమానులు ఏవిధంగా సహకరించారో ఇప్పుడు నూతన నాయుడుకు ‘బిగ్ బాస్ 2’ విషయంలో పవన్ అభిమానులు అదే స్థాయిలో సహకరించడం బట్టి చూస్తుంటే ‘బిగ్ బాస్’ షో విజేతను నిర్ణ యించే కీలక శక్తిగా పవన్ అభిమానులు మారారా అని అనిపించడం సహజం..   


మరింత సమాచారం తెలుసుకోండి: