నటించిన మొదటి సినిమాతోనే యూత్ కు క్రేజీ హీరోగా మారిపోయిన కార్తికేయ తాను హీరోగా మారడానికి పడిన కష్టాలను వివరిస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను మోసం చేసిన వ్యక్తుల గురించి వివరించాడు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాల పై ఉన్న పిచ్చితో తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సినిమా హీరోగా మారాలని చేసిన ప్రయత్నాలలో కొందరు ఏవిధంగా మోసం చేసారో వివరంగా వివరించాడు. 

సినిమా హీరో అవ్వాలని తాను ఆడిషన్స్ కు వెళితే అక్కడ తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు ఒక లక్ష రూపాయలు ఇస్తే సినిమా హీరో ఛాన్స్ ఇస్తాము అంటూ చెప్పిన మాటలు నమ్మి అనేకమందికి అనేక సందర్భాలలో డబ్బు ఇచ్చి మోసపోయిన విషయాన్ని బయటపెట్టాడు. ఆ డబ్బు తీసుకున్నాక కొందరు నిర్మాతలు తనతో మాట్లాడే విషయంలో కనీసం తన ఫోన్ కూడ లిఫ్ట్ చేయకుండా చేసిన మోసాన్ని వివరిస్తూ అవకాశాల కోసం ఇలా తనలా డబ్బిచ్చి మోసపోవద్దని సలహాలు ఇస్తున్నాడు కార్తికేయ.

వాస్తవానికి తనకు వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చినా అందులో చేరకుండా సినిమాల పట్ల మోజుతో సుమారు మూడు సంవత్సరాలు తన తండ్రి పంపించే లక్షల రూపాయలను తన అవకాశాల వేటలో ఖర్చు పెడుతూ తాను మోసపోయిన సందర్భాలను వివరించాడు. అయితే అదృష్టం కొద్ది ఒక స్నేహితుడు ద్వారా ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ పరిచయం కాకపోతే తాను ఈసినిమాల పిచ్చితో మరింత డబ్బును పోగొట్టుకునే వాడిని అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు.
rx-100-hero karthikeya
క్రేజీ హీరోగా యూత్ కు బాగా కనెక్ట్ అయిన కార్తికేయ 10వ క్లాస్ చదువుకునే వరకు చాల పొట్టిగా ఉండేవాడట. దీనితో పొట్టిగా ఉండే హీరోలను తన రోల్ మోడల్స్ గా ఎంచుకుని తన హీరో కలలను కొనసాగించాడు. అయితే అదృష్టం కొద్దీ కార్తికేయ ఇంటర్ చదివే సమయానికి పొడుగు అవ్వడమే కాకుండా 6 అడుగుల పొడుగుకు చేరడం తన అదృష్టం అని అంటూ ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమా తనకు వస్తుందని తన కలలో కూడ ఊహించుకోలేదు అని అంటున్నాడు కార్తికేయ. ఏది ఎలా ఉన్నా కార్తికేయ జీవితాన్ని ప్రస్తుతం లక్ తోడైంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: