టాప్ హీరోల అభిమానులు తమ హీరోలను ఏవిధంగా ఆరాధిస్తారో తెలిపే మరో ఆసక్తికర సంఘటన నిన్న జరిగిన ‘గీతాగోవిందం’ ఆడియో ఫంక్షన్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు ఒక వీరాభిమాని వేదిక పైకి వేగంగా దూసుకు వచ్చి అమాంతం బన్నీ కాళ్లపై పడ్డాడు. 
సినిమా చూసేశా
దీనితో షాక్ అయిన అల్లుఅర్జున్ బౌన్సర్లు అతడిని బలవంతంగా పక్కకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలను పసికట్టిన బన్నీ వెంటనే స్పందించి వేదిక పై ఉన్న ఆవీరాభిమాని దగ్గరకు వెళ్లి అతడిని సముదాయించి జాగ్రత్తగా వేదిక దిగేల చేసాడు. ఈ ఫంక్షన్ లో అనుకోకుండా బన్నీ చెప్పిన మాటలు అతడి అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించాయి. 
పరుగు సినిమా నుంచి
అల్లుఅర్జున్ ఉపన్యాసానికి అడ్డు తగులుతూ అతడి అభిమానులు అతడి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ గోల చేస్తుంటే బన్నీ ఆమాటలకు స్పందిస్తూ తన కొత్త సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుందని అతడి అభిమానుల ఆశల పై నీళ్ళు జల్లాడు. దీనితో అప్పటిదాకా ఉత్సాహంతో ఊగిపోయిన అభిమానులు నిరాశతో మౌనం వహించారు. 
అర్జున్ రెడ్డికి ఫిదా
ఇదే సందర్భంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తన తండ్రి తీసిన చాలా సినిమాల ఫంక్షన్స్ కు తాను రాలేదు అని చెపుతూ ఈమూవీ ఘన విజయం పై తనకున్న నమ్మకంతో ఈరోజు ధైర్యంగా ఈమూవీ గురించి చెపుతున్నాను అంటూ చేసిన కామెంట్స్ ఈమూవీ విజయం పై అల్లు కాంపౌండ్ కు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఇక చివరిగా ఈమూవీ వల్ల వచ్చే లాభాలతో తనకు ఒక మంచి కారు కొని ఇమ్మని తన తండ్రిని కోరుతూ బన్నీ చేసిన కామెంట్స్ ఆ కార్యక్రమంలో నవ్వులు పూయించాయి. నిన్న ‘గీతాగోవిందం’ ఆడియో ఫంక్షన్ లో జరిగిన బన్నీ అభిమాని వీరంగాన్ని చూసిన వారికి బన్నీకి కూడ పవన్ లాగే భక్తులు ఏర్పడుతున్నారా అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: