ఈ మద్య సోషల్ మీడియాలో లీకుల గోల విపరీతంగా సమస్యలు సృష్టిస్తున్నాయి.  ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కొన్ని ఫోటో లీక్స్ వల్ల చిత్ర యూనిట్స్ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ మద్య వరుసగా ‘సైరా’ చిత్రంలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నామద్య మహేష్ బాబు కి సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. అయితే చిత్ర యూనిట్ కి సంబంధించిన వాళ్లు ఈ లీకులకు పాల్పపడుతున్నారని..వారిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. 

Image result for ntr photo leak

 గతంలో ఓ సినిమా తీస్తే..ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరో ఎలా ఉంటారో అభిమానులు తెగ ఆలోచనలో పడేవారు.  కొన్ని సార్లు తమ హీరో డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వడంతో ఎంతో ఆశ్చర్యానికి..ఆనందానికి లోనవుతారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ అభిమాన హీరో ఎలా ఉంటాడో సినిమా రిలీజ్ కాకముందో..అంతెందుకు ఫస్ట్ లుక్ రిలీజ్ కాకముందే తెలిసిపోతుంది.

Image result for ntr photo leak

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ లుక్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇందులో ఎన్టీఆర్ రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఒకటి కాలేజ్ స్టూడెంట్ గా దర్శనమిచ్చింది.  ఇప్పటికే ఎన్టీఆర్- నాగబాబుకు సంబంధించి ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోని ఫోటో లీకయింది.  తాజాగా 'అరవింద సమేత' షూట్ లొకేషన్ నుండి మరో పిక్ లీకయింది.  ఎన్టీఆర్ వీరరాఘవ అవతారంలో ఉన్న సీమ యువకుడి గెటప్. 

ఈ గెటప్ లో  తెలుపు రంగు ఖద్దరు టైపు కుర్తా..  కిందేమో బ్లూ కలర్ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ ఉన్నాడు.  'అరవింద సమేత' టీమ్ లొకేషన్ నుండి ఫోటోలు లీక్ కాకుండా యూనిట్ మెంబర్స్ ను ఫోన్లు - ట్యాబులు తీసుకురావద్దని ఆంక్షలు విధించడం లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం ఆగకపోవడం విశేషం.   ఈ సినిమాను దసరా బరిలో నిలిపేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  పూజ హెగ్డే ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: