ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి విడాకులు పొందిన తరువాత ఏడెనిమిదేళ్లు రేణూ దేశాయ్ తన పిల్లలతో పూణే లో ఒంటరి జీవితం జీవితం గడిపి ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మరో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తనను పెళ్ళి చేసుకోబోతున్న రెండవ భర్త విషయంలో వ్యూహాత్మక లీకులు ఇస్తూ అతడి వివరాలు చాల గోప్యంగా ఉంచుతున్న రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి తనకు కాబోయే భర్త ఉండే అమెరికాకు వెళ్ళి తన కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
Renu Desai
ఇప్పుడు ఈన్యూస్ వైరల్ కావడంతో పవన్ పిల్లలు ఎక్కడ ఉంటారు ఆమెకు కాబోయే భర్తతో పవన్ పిల్లలు సాన్నిహిత్యంగా ఉంటారా ఆతరువాత రేణు దేశాయ్ భర్త పవన్ పిల్లలను ప్రేమగా చూసుకుంటాడా అన్న అనుమానాలు అనేకం పవన్ అభిమానులలో ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థుతులలో రేణు దేశాయ్ ఇటీవల సొంత యూట్యూబ్ ఛాన‌ల్‌ లో అప్‌లోడ్‌ చేసిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ లో కొన్ని సందేహాలకు రేణు దేశాయ్ సమాధానాలు ఇచ్చింది. 

పవన్ పిల్లలను తనకు కాబోయే భర్త చాల ఆనందంగా చూసుకుంటున్నాడని తన పిల్లలు ఇంత ఆనందంగా ఉండటం తాను ఈమధ్య ఎప్పుడు చూడలేదని అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం తాను న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న సమయం చాల ఆనందంగా గడిచిపోతోంది అంటూ పవన్ అభిమానుల అనుమానాలకు వ్యూహాత్మక సమాధానాలు ఇచ్చింది.  
 మరో సంచలన ఇంటర్వ్యూకు సిద్ధం
తాను తన పిల్లలు తనకు కాబోయే భర్తతో గడుపుతున్న అద్భుత క్షణాల గురించి వివరిస్తూ “మిస్టర్ ఫియాన్సీ తో గడుపుతున్న కొన్ని అద్భుతమైన క్షణాలను కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను” అంటూ  ఆ ఫొటోలో రేణూని హత్తుకున్న ఆద్య అకిరాలు ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ లీక్ చేస్తున్న ఈఫోతోలను చూసిన చాలామంది తనకు కాబోయే భర్తతో తన పిల్లలు సఖ్యతగా ఉంటున్నారని చెప్పడానికి రేణు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: