ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ వేగంలో క్రిష్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలలో దేవుడుగా ఇప్పటికి పరిగణింపబడుతున్న నందమూరి తారకరామారావు జీవితాన్ని ఒక అద్భుత దృశ్య కావ్యంగా తీయాలని బాలకృష్ణ క్రిష్ తో కలిసి చేస్తున్న విశేష కృషి ఈమూవీ పై భారీ అంచనాలు పెంచుతున్నాయి.
కళ్ళు చెదిరే ఆఫర్
ఈమూవీ చిత్రీకరణ ప్రారంభమై కొన్నిరోజులు మాత్రమే అవుతున్నా ప్రస్తుతం ఈమూవీకి వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఒక బయోపిక్ సినిమాకు టాప్ హీరోల సినిమాల స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది అని అంటున్నారు. 
కీలక పాత్రలు
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ సంస్థ సోని పిక్చర్స్ బాలయ్య ముందు కళ్ళు చెదిరే ఆఫర్ ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. సోని సంస్థ ఎన్టీఆర్ బయోపిక్ హక్కుల కోసం 80 కోట్ల భారీ డీల్ బాలయ్య ముందు ఉంచినట్లు టాక్. ఈ డీల్ ప్రకారం తెలుగు తమిళ హిందీ హక్కులను సోనీ సంస్థకు ఇవ్వవలసి ఉంటుంది. 
విద్యాబాలన్
అయితే ఈ డీల్ ను బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ పై కనీసం 100 కోట్ల బిజినెస్ చేసే ఉద్దేశ్యంలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. దీనికితోడు ఈ బయోపిక్ విషయంలో క్రిష్ కూడ చేరడంతో బాలయ్య తాను అనుకున్న లక్ష్యాలను సులువుగా అధికమించవచ్చు అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమూవీలోని పాటలను సూపర్ హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుని కీరవాణి చేత అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే సోనీ సంస్థ ఆఫర్ ను తిరస్కరించడంలో బాలయ్య ఆలోచనల్లో ఆంతర్యం బాలయ్యకే తెలియాలి..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: