సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుండి ఇరువురి స్నేహితుల మధ్య ఉండే స్నేహ బంధాన్ని ఎమోషన్స్ ను త్యాగాలను హైలెట్ చేస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అనేక భాషలలో ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడే ప్రేమానురాగ అసూయలను హైలెట్ చేస్తూ ఎన్నో కథలు సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరితలో అనేక సినిమాలు నిలిచిపోయాయి.

ఒక మంచి స్నేహితుడు ఉన్న ప్రతీ వ్యక్తి అందరికంటే అదృష్టవంతుడు ధనవంతుడు అన్న కాన్సెప్ట్ తో వచ్చి చరిత్ర సృష్టించిన సినిమాలలో మొదటి స్థానం  1975వ సంవత్సరంలో వచ్చిన 'షోలే'. మూవీ స్నేహం గురించి స్నేహితుల మధ్య త్యాగాల గురించి చెప్పే ఒక రియల్ బ్లాక్ బస్టర్. ఆసినిమా ప్రభావంతో ఎన్నో సినిమాలు మన దేశంలోని అన్ని భాషలలోను వచ్చాయి. ఈ సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ మధ్య స్నేహ బంధాన్ని వివరిస్తూ ఈ సినిమాలోని 'యే..దోస్తీ హమ్ నహీ తోడెంగే' అనే పాట ఇప్పటికీ మెమరబుల్ హిట్ సాంగ్. 

2009లో విడుదలై సంచలనాలు సృస్టించిన అమీర్ ఖాన్ 'త్రీ ఇడియట్స్’ తో పాటు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడ ఎన్నో సినిమాలు స్నేహ బంధం పై వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో స్నేహం నేపధ్యంలో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవాలి అంటే 1999లో రిలీజైన ‘స్నేహం కోసం’ సినిమాను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈమూవీలో నటించినందుకు చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడ వచ్చింది.

ఇదే కోవలో  విక్టరీ వెంకటేశ్ కళ్యాణి ఆర్తి అగర్వాల్ లు నటించిన ‘వసంతం’ ఇదే తరహాలో సిద్ధార్థ్ శృతి హాసన్ లు నటించిన 'ఓ మై ఫ్రెండ్' సినిమాలను పేర్కొనాలి. ఇక స్నేహ బంధం పై తీసిన సినిమాలలో రియల్ క్లాసిక్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాప్పీడేస్' సినిమా గురించి చెప్పాలి. కాలేజ్ డేస్ లో పరిచయమయ్యే స్నేహాలు, వారి నుంచి లభించే స్వీట్ మెమొరీస్ ను బ్యూటిఫుల్ గా తీసిన ఈమూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇలా అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీరామారావు కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజుల ఆతరం నుండి ఈతరం హీరోల వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ స్నేహం నేపధ్యంలో వచ్చాయి. ఒక మంచి స్నేహితుడు ఉన్న ప్రతీ ఒక్కరూ అదృష్టవంతులే అంటూ చెప్పే కథతో నిర్మాణం అయ్యే ఇలాంటి సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంతవరకు వస్తూనే ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: