తెలుగు ఇండస్ట్రీలో భరత్ అనే నేను చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తాజాగా నిర్మాత, దర్శకులు పైడిపల్లి వంశి దర్శకత్వంలో  ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూ లుక్ తో కనిపించడమే కాదు కాలేజ్ స్టూడెంట్ గా అందరినీ అలరించబోతున్నాడట.  ఆ మద్య శ్రీమంతుడు చిత్రంలో కూడా కాలేజ్ స్టూడెంట్ గా చాలా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. ఇక కాలేజ్ అంటే అదో అందమైన ప్రపంచం..ఆటలు, పాటలు, ర్యాగింగ్, గొడవలు ఇలా ఎన్నో వండర్స్ ఉంటాయి. 
Image result for mahesh babu vamsi paidipally
తాజాగా ఈ చిత్రంలో కూడా అలాంటి వాతావరణం చూపించబోతున్నట్లు తెలుస్తుంది.  ఆ మద్య అర్జున్ రెడ్డి చిత్రంలో ఫుడ్ బాల్ ఆటతో మొదలై..పెద్ద గొడవ తో ముగుస్తుంది.  తాజాగా మహేష్ సినిమాలో కూడా ఇలాంటి పైట్ తప్పలేదు. క్రికెట్ ఆట సందర్భంగా బ్యాట్ లను బ్యాటింగ్ కోసం కాకుండా, ఫైటింగ్ కోసం వాడక తప్పలేదు. ఈ సినిమాకు సంబంధించి గడచిన రెండు మూడు రోజులుగా ఓ ఫైట్ చిత్రకరించారు. 
Related image
కాలేజీలో క్రికెట్ ఆట సందర్భంగా రెండు విద్యార్థి గ్రూప్ ల మధ్య వివాదం తలెత్తి, ఫైటింగ్ కు దారితీయడం, ఆ నేపథ్యంలో భారీ ఫైట్ అన్నమాట. 
అయితే ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది..కానీ ఇప్పటి వరకు టైటిల్ మాత్రం నిర్ణయం కాలేదు..మొత్తానికి ఈ సినిమాలో కొంత భాగం మహేష్ స్టూడెంట్ గా ఉండటం..ఆ సమయంలో క్రికెట్ ఫైట్ ఉండటం సినిమా కొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: