సాధారణంగా తెలుగు లో హిట్ అయిన చిత్రాలు తమిళంలో డబ్బింగ్ అవుతుంటాయి..అలాగే తమిళంలో హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్ అవుతుంటాయి. కొన్ని చిత్రాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆయా బాషల నేటివిటీకి తగ్గట్టుగా రిమేక్ చేయబడుతాయి.  గతంలో విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రిమేక్ చేయబోతున్నారు. 
Related image
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో జల్సా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘అత్తారింటికి దారేది’.ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతంగా పండించారు.  ఇక ఫైట్స్ విషయంలో చాలా కొత్తదనాన్ని చూపించారు.  త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ పవన్ నోట వస్తుంటే..ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది. 

తాజాగా ఈ చిత్రం  తమిళంలో రాబోతోంది.  అక్కడ అతి పెద్ద ప్రొడక్షన్ హౌసుల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది రీమేక్ రైట్స్ దక్కించుకుంది. ప్రస్తుతం దర్శకులు శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 లాంటి అతి భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కాబట్టి ఈ చిత్రం కూడా భారీ ఖర్చుతోనే తీసే అవకాశం ఉంది. 
Related image
అయితే ఈ చిత్రంలో హీరో అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక అత్తారింటికి దారేది మూవీని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేశారు. ‘ఈగ’ చిత్రంలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే కిచ్చా సుదీప్ ఈ చిత్రం చేశాడు. రన్న పేరుతో వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి హిట్ కొట్టింది. హీరో అత్తగా తెలుగు నదియా చేసిన పాత్రను బాలీవుడ్ హీరోయిన్ మధుబాల చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: