ఇంటర్ నేషనల్ ఫిగర్..బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్న హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.   క్రిష్ సీరీస్ తో నెంబర్ వన్ స్తాయికి వచ్చిన ఈ అమ్మడు హాలీవుడ్ లో క్వాంటికో సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది.   అమెరిక‌న్ టీవీ షోతోపాటు ప‌లు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రియాంక న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అమెరిక‌న్ న‌టుడు, సింగ‌ర్ నిక్ జొనాస్‌తో ప్రియాంక‌ ప్రేమ‌లో ప‌డింది.  తాజాగా ప్రియాంక చోప్రా స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి `భార‌త్‌` సినిమాలో న‌టించేందుకు కొన్ని రోజుల క్రితం ప్రియాంక అంగీకారం తెలిపింది.
Image result for priyanka chopra lover
అయితే సినిమా మొద‌ల‌వ‌బోతోంద‌న‌గా ఆ సినిమా నుంచి అర్థంత‌రంగా నిష్క్ర‌మించింది. ఈ వార్త‌ల‌ను తాజాగా ప్రియాంక స‌న్నిహితులు ఖండించారు. `భార‌త్‌` నుంచి త‌ప్పుకోవ‌డానికి, ప్రియాంక పెళ్లికి అసలు సంబంధ‌మే లేద‌ని తెలిపారు. రెమ్యున‌రేష‌న్ కార‌ణంగానే ఈ సినిమా నుంచి ప్రియాంక త‌ప్పుకుంద‌ని వెల్ల‌డించారు. 
Related image
ప్రియాంక రూ.14 కోట్లు డిమాండ్ చేయ‌గా, నిర్మాత‌లు కేవ‌లం 6.5 కోట్లు మాత్ర‌మే ఇస్తామ‌న‌డం ప్రియాంక‌కు న‌చ్చ‌లేద‌ని తెలిపారు. అంతే కాదు ఈ చిత్రంలో మరికొంత మంది నటుల విషయంలో కూడా  ప్రియాంక‌కు తేడా వచ్చిందని..అందుకే ఆమె సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని క్లారిటీ ఇచ్చారు. `భార‌త్‌` నుంచి ప్రియాంక త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలోకి క‌త్రినా కైఫ్ వ‌చ్చింది. ఏది ఏమైనా తన ప్రియుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మడి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లు త్యాగం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: