Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 2:42 am IST

Menu &Sections

Search

మహేష్ చేతుల మీదుగా ‘శ్రీనివాస కళ్యాణం’ట్రైలర్!

మహేష్ చేతుల మీదుగా ‘శ్రీనివాస కళ్యాణం’ట్రైలర్!
మహేష్ చేతుల మీదుగా ‘శ్రీనివాస కళ్యాణం’ట్రైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదలకు సిద్ధమవుతోంది. వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన కళ్యాణ వైభోగం లిరిక్స్‌కు మంచి స్పందన లభించింది.ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటలు ఆకట్టుకున్నాయి. 60 మంది నటీనటులతో.. తెలుగింటి పెళ్లికళ ఉట్టిపడేలా భారీస్థాయిలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
srinivasa-kalyanam-trailer-mahesh-babu-rashi-kanna
ఈ మూవీ మేకింగ్ వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది. కాగా, సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల కానుండడం విశేషం. ఆగష్టు 2 సాయంత్రం 5:30 గంటలకు మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మురారి’లో రొమాంటిక్ లవర్‌గా కనిపించిన మహేష్.. పెళ్లి కొడుకు అంటే ఇలాం ఉండాలని అమ్మాయిలు అనుకునేలా బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఆ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి..’ అనే పాట ఇప్పటికీ పెళ్లింట కచ్చితంగా వినిపిస్తుంది.
srinivasa-kalyanam-trailer-mahesh-babu-rashi-kanna
‘శ్రీనివాస కళ్యాణం’ ఆగష్టు 9న, మహేష్ బాబు జన్మదినం రోజే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. నందిత శ్వేత మరో కథానాయికగా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. రాజేంద్రప్రసాద్ .. ఆమని .. సీనియర్ నరేశ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కి .. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రం హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకం అందరిలోను కనిపిస్తోంది.  


srinivasa-kalyanam-trailer-mahesh-babu-rashi-kanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.