పవన్ కళ్యాణ్ నిన్న తన ‘జనసేన’ కు సంబంధించిన ‘వీర మహిళ’ విభాగం సమావేశంలో శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఒక అమ్మాయి తనను బహిరంగంగా తిట్టినా తాను భరించాను అని అంటూ ఆమె తప్పు చేసినా ఆడబడుచుల పై ఉన్న గౌరవంతో తాను ఆ మహిళ తిట్టిన తిట్లు అన్నీ భరించాను అంటూ కామెంట్స్ చేసాడు. 
ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి
మహిళల పట్ల తానుచాల సహనంగా ఉంటానని అదే తాను మహిళలకు ఇచ్చే గౌరవం అని అంటూ తాను తన తల్లి వద్దనే కాకుండా తన వదిన పెంపకంలో పెరిగానని ఆడబడుచులతో ఎలా సంస్కారవంతంగా మెలగాలో తనకు తన కుటుంబ పెంపకంలోనే వచ్చింది అని అంటున్నాడు పవన్. గతంలో తాను సినిమాలలో నటిస్తున్నప్పుడు సినిమా షూటింగ్ రాత్రిపూట ఆలస్యం అయితే తన సెట్లో ఉన్న చిన్నచిన్న పాత్రలను చేసే మహిళలను తన కారులో వారిని ఇంటి దగ్గర దింపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ మహిళల పట్ల గౌరవం గురించి తనకు ఎవరు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
మహిళల వలే మగవారు మల్టి టాస్కింగ్ చేయలేరు
ఇప్పుడు పవన్ మహిళల పట్ల చేసిన కామెంట్స్ సంచలనంగా మారడంతో యాంకర్ అనసూయ రంగంలోకి దిగి పవన్ కు వత్తాసు పలుకుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో శ్రీరెడ్డి విషయంలో తాను చేసిన కామెంట్స్ గుర్తుకు చేసుకుంటూ పవన్ ను శ్రీరెడ్డి సరిగ్గా అర్ధం చేసుకోలేదు అన్న అప్పటి ఆవిషయాలను గుర్తుకు చేసుకుంటూ పవన్ కు మహిళల పై ఎంత గౌరవం ఉందో ఇప్పటికైనా శ్రీరెడ్డికి అర్ధం అయితే బాగుండును అన్న అర్ధం వచ్చేలా కామెంట్స్ చేసింది.
జగన్‌ను నేను అలాగే అంటే ఇంట్లో వాళ్లు బాధపడతారని తెలుసు
నిన్న జరిగిన ‘జనసేన’ ‘వీర మహిళ’ విభాగం సమావేశంలో ‘జనసేన’ లో మహిళల సభ్యత్వం చాల తక్కువగా కనిపిస్తూ ఉండటం పై పవన్ కొన్ని కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏరాజకీయ పార్టీకి అయినా మహిళల సభ్యత్వంతో పాటు అండదండలు చాల అవసరం అని చెపుతూ ‘జనసేన’ లో మహిళల సభ్యత్వ పెంపు గురించి అదేవిధంగా పార్టీ కార్య కలాపాలలో మహిళలను చాల ఉత్సాహంగా ఇన్వాల్వ్ చేసే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అంటూ పవన్ తన సన్నిహితులతో ప్రస్తుతం తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: