హీరోయిన్ మిస్సింగ్..ఈ షాకింగ్ న్యూస్ తో అందరూ అలర్ట్ అయ్యారు..అంతే కాదు ఆ హీరోయిన్ ఉన్నట్టుండి ఎలా మాయమైందీ అంటూ ఆందోళన చెందారు. దాంతో హీరోయిన్ మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఆ హీరోయిన్ మన దేశం అమ్మాయి మాత్రం కాదు..చైనా నటి ఫ్యాన్ బింగ్ బిం. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఈ అమ్మడు బింగ్ బింగ్ జూలై 1 న చిన్నారుల ఆసుపత్రిని సందర్శించినప్పటి నుంచి ప్రేక్షకులకు కనిపించటం లేదట.
Image result for actress bing bing missing
ఆ రోజు నుంచి బింగ్ బింగ్ సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టూ పెట్టడం లేదని తెలుస్తోంది.  సోషల్ మీడియాలో ఆమె 62 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. బింగ్ బింగ్ పెట్టే ఒక్కో పోస్టుకు వేలల్లో కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. నెల రోజులుగా బింగ్ బింగ్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Image result for actress bing bing missing
జూన్ 2న ఆమె చివరిసారిగా పెట్టిన పోస్టుపై రిప్లైగా ఆమె క్షేమంగా ఉన్నానంటూ ఒక్క పోస్ట్ పెట్టాలంటూ చాలా మంది అభిమానులు కోరుతున్నారు.ఆమె క్షేమంగా ఉన్నానన్న ఒక్క మాట కోసం కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: