బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరిద్దరి కలయిక పై విపరీతమైన క్రేజ్ ఉంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో మొదలుకాబోతున్న లేటెస్ట్ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అన్న కలలలో బాలయ్య అభిమానులు ఉన్నారు. 
 100 కోట్ల బడ్జెట్
ప్రస్థుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరి కలయికతో ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కాబోయే ఈమూవీ ఒక రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా అని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలయ్య బోయపాటిల మూవీ పట్టాలు ఎక్కుతుందని వార్తలు వస్తున్నాయి. 
బోయపాటి సినిమాలు
ఇప్పటి వరకు బాలకృష్ణ బోయపాటిల మూవీలు అన్నీ మాస్ సినిమాలుగా ఉన్న నేపధ్యంలో ఈసారి తీయబోయే మూవీ కథ మాస్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కు కూడ నచ్చే విధంగా బోయపాటి ఇప్పటికే ఈసినిమా కథను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీ బడ్జెట్ ను కూడ 100 కోట్లు అని బోయపాటి ఫిక్స్ చేసినట్లు టాక్.

ప్రస్తుత తరం టాప్ యంగ్ హీరోల సినిమాలు అన్నీ 100 కోట్ల బడ్జెట్ ఉంటున్న నేపధ్యంలో సీనియర్ హీరోగా దాదాపు 40 సంవత్సరాల కెరియర్ ఉన్న బాలకృష్ణ మార్కెట్ పెంచాలి అన్న  ఉద్దేశ్యంతో బాలయ్య మూవీ పై భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి బోయపాటి స్థిరనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించి అదేవిధంగా బడ్జెట్ కు సంబంధించి బాలకృష్ణ అంగీకారాన్ని తీసుకున్న బోయపాటి ఈమూవీ ప్రారంభోత్సవాన్ని రాబోతున్న దసరా రోజున చేయాలని గట్టి పట్టుదలపై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: