మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి ‘రిషీ’ అన్న టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు అని వస్తున్న వార్తలు మహేష్ అభిమానులలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల టైటిల్ పేరు వినగానే అటువంటి ఆలోచనలు వద్దు అంటూ మహేష్ కు తెలిసేలా ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తున్నారు. 
mahesh babu, vamsi paidipally, mahesh babu vamsi paidipally
మహేష్ అభిమానులు ఈ స్థాయిలో కలవర పాటుకు గురి కావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. మహేష్ కెరియర్ లో నటించిన రెండు అక్షరాల టైటిల్స్ తో ఉన్న సినిమాలు అన్నీ ఇప్పటి వరకు భయకరమైన ఫ్లాప్ లుగా మారి మహేష్ కెరియర్ ను ఒక కుదుపు కుదిపాయి. 
Mahesh Babu new movie title Raajasam!
సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో పరమ డిజాస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసిన బాబీ-నానీ-వంశీ- నిజం సినిమాలు అన్నీ భయంకరమైన ఫ్లాపులు. మహేష్ కు మూడు అక్షరాల టైటిల్స్ కలిసి వచ్చినట్లుగా మరి ఏ టైటిల్స్ కలిసిరాలేదు. అయితే వీటిలో సగం ఫ్లాపులు కూడ ఉన్నా మహేష్ కెరియర్ కు టర్నింగ్ ఇచ్చిన ‘ఒక్కడు’ ‘దూకుడు’ ‘పోకిరి’ మూవీలు చరిత్ర సృష్టించాయి. 
Bharat Ane Nenu,Mahesh Babu,Bharat Ane Nenu box office
ఈవిషయాలను దృష్టిలో ఉంచుకుని మహేష్ నటిస్తున్న 25వ సినిమాలో ఆసినిమా కథ రీత్యా క్యారెక్టర్ పేరు ‘రిషీ’ అయితే అలాగే ఉంచేసి సినిమా టైటిల్ ను మాత్రం మార్చమని అభిమానులు ప్రిన్స్ కు తెలిసి వచ్చేలా అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈవిషయాలు మహేష్ వంశీ పైడిపల్లిల దృష్టి వరకు వెళ్ళడంతో ఈమూవీకి వేరే టైటిల్ ఆలోచించాలా లేదంటే సెంటిమెంట్ ను లెక్కలోకి తీసుకోకుండా ధైర్యం చేయాలా అన్న విషయాల పై మహేష్ వంశీ పైడిపల్లితో తీవ్ర స్థాయిలో ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అతి త్వరలో రాబోతున్న మహేష్ పుట్టినరోజు లోపు ఈవిషయమై ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: