కన్నడ బ్యూటీ రష్మిక నాగశౌర్యతో నటించిన ‘ఛలో’ విడుదల తరువాత ఆమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. దీనితో టాలీవుడ్ యంగ్ హీరోల దృష్టి అంతా ఈమె పైనే ఉంది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవర కొండతో నటిస్తున్న ‘గీత గోవిందం’ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Rashmika, Vijay Deverakonda
ఈమూవీలో విజయ్ దేవరకొండ రష్మికల మధ్య చిత్రీకరించిన లవ్ ట్రాక్ సీన్స్ లో వీరిద్దరూ చాల ఇన్వాల్వ్ అయి నటించిన నేపధ్యంలో ఆసీన్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ విడుదల కాకుండానే తిరిగి వీరిద్దరి కాంబినేషన్ తో నిన్న షూటింగ్ ప్రారంభం అయిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ విషయంలో రష్మిక ఎంపిక వెనుక విజయ్ దేవరకొండ హస్తం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

Worlds first 5G smartphone Moto Z3 launched

ఈమూవీలో విజయ్ దేవర కొండతో కలిసి నటించే విషయంలో ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ పేర్లను ఈసినిమా దర్శక నిర్మాతలు పరిశీలించినా వారందరినీ కాదని విజయ్ పట్టుపట్టి రష్మికకు భారీ పారితోషికం ఇప్పించి ఆమెను తన పక్కన హీరోయిన్ గా ఇంకా ‘గీత గోవిందం’ రిజల్ట్ రాకుండానే ఎంపిక చేయడం జరిగింది. దీనితో వీరిద్దరి స్నేహం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

Rashmika And Vijay Tweets Would Make Your Day
అయితే ఈ వార్తలు అన్నీ నిరాధారాలు అని ఎవరోకావాలని విజయ్ దేవర కొండ పై ఇలాంటి గాసిప్పులు సృష్టిస్తున్నారని కేవలం వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో వీరిద్దరినీ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రిపీట్ చేసారని అంటున్నారు. అయితే విజయ్ దేవర కొండ అన్ని విషయాలలోనూ చాల స్పీడ్ కాబట్టి వీరిద్దరి మధ్య పెరుగుతున్న స్నేహం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: