తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది.   మొదట్లో  ఎలాంటి హడావుడి లేకున్నా మూడో వారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో రక రకాల ట్విస్టులు నెలకొంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కొంత మంది గ్రూపులు, ప్రేమాయణాలు, కక్ష్యలు, తిట్టుకోవడాలు ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది.  ఇక టాస్క్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ టాస్క్ లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు. 
 నామినేషన్
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి మోడల్, నటుడు కౌశల్ అందరికీ టార్గెట్ అవుతున్న విషయం తెలిసిందే.  అయితే హౌజ్ లో కౌశల్ ఎంత టార్గె అవుతున్నారో..బయట అతని బలం మరింత పెరిగిపోతుంది.  ప్రస్తుతం కౌశల్ ఆర్మి అంటూ కొంత మంది సోషల్ మాద్యమాల ద్వారా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు.  అంతే కాదు కౌశల్ ని టార్గెట్ చేసిన వారందరికి ఓట్లు వేయకుండా హౌజ్ నుంచి బయటకు పంపేలా పరిస్థితి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ని తనీష్ - బాబు గోగినేనిలు  ఎలా ముప్పుతిప్పలు పెడుతూ విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.. ఇన్నాళ్లు అయితే బాబు లేదంటే తనీష్ మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు.కానీ ఈ వారం ఇద్దరూ ఎలిమినేషన్ కు నామినేట్ కావడంతో కౌశల్ ఆర్మీ సమాయత్తమైంది. బలమైన ఈ ఇద్దరిలోంచి ఒకరిని ఇంటికి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  ఈ సోమవారం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చాడు. బయట గార్డెన్ ఏరియాలో ఓ టెంట్ ను ఏర్పాటు చేసి ఇంటిసభ్యులందరూ ఎవరైతే ముందుగా అందులోకి వెళతారో వారంతా సేఫ్ అని.. చివర్లో వెళ్లిన వారు ఎలిమినేట్ అవుతారని పేర్కొన్నాడు.

ఈ టాస్క్ లో బాబు గోగినేని, తనిష్ లు ఫెయిల్ అయ్యారు. అంతే కాదు  గీతామాధురి - శ్యామల - గణేష్ - దీప్తి నల్లమోతు కూడా టెంట్ లోకి ముందుగా వెళ్లడంలో విఫలమై నామినేషన్ లోకి వచ్చారు.   ఇక ఇంటిసభ్యులందరిలో బలమైన తనీష్ - బాబు గోగినేనిలు ఒకేసారి నామినేషన్స్ లోకి రావడంతో కౌశల్ ఆర్మీ ఎలాగైనా సరే వీరిలో ఒకరిని బయటకు పంపించేందుకు దృష్టి పెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: