క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు మెగా కాంపౌండ్ అందిస్తున్న సహాయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే ఇతడి లేటెస్ట్ మూవీ ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా అల్లు అర్జున్ రావడమే కాకుండా అతడిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించి కొన్ని రోజులు కాకుండానే ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా విజయ్ దేవరకొండ కోసం చిరంజీవి రంగంలోకి దిగుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. 
Vijay Deverakonda and Rashmika Mandanna in Geetha Govindam. Image via Facebook
‘గీతాగోవిందం’ ఈనెల 15న రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ ను మరింత పెంచడానికి ఈమూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి అల్లు అరవింద్ వ్యూహాలు రచిస్తున్నాడు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మించిన ఈమూవీకి భారీ కలక్షన్స్ రాబట్టడానికి ఈనెల 12న ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి అతిధిగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బావమరిది అల్లు అరవింద్ కోరిక మేరకు చిరు ఈ ఫంక్షన్ కు అతిధిగా రావడానికి అంగీకరించాడని తెలుస్తోంది. 
geetha govindam first single inkem inkem inkem kaavaale released
ఇప్పుడు ఈన్యూస్ విజయ్ దేవర కొండ వరకు చేరడంతో అతడు ఆనందంతో ఫుల్ గా ఎక్సైటింగ్ మూడ్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో విజయ్ దేవర కొండకు మెగా అభిమానుల సపోర్ట్ కూడ దొరికితే ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని అంటున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: