మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 71 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా మరి కొన్ని రోజులలో మన ఎర్ర కోట పై మన భారత జాతి పౌరుషానికి చిహ్నంగా ఎగరబోయే ‘జెండా’ పండుగ గురించి ఉత్సాహంతో భారతదేశ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం మహాత్మాగాంధీ చేసిన అహింసా పోరాటం వలెనే వచ్చినా ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది విప్లవ వీరుల త్యాగాలలో భగత్ సింగ్ ఒకరు. 
Bhagat Singh
మనదేశం స్వాతంత్రం పొందడానికి ప్రధమ స్వాతంత్ర పోరాటం జరిగిన 1857 సంవత్సరం నుండి చిట్ట చివరకు బ్రిటీష్ వారిని మన దేశం నుండి తరిమివేయడానికి 90సంవత్సరాలు పట్టింది.  భారతదేశం స్వాతంత్రం పొందడానికి కొన్ని వేల సంఖ్యలో స్వాతంత్ర సమరయోధులతో పాటు విప్లవ కారులు కూడ పాల్గొన్నారు. ఈ విప్లవ కారులో భారత ప్రజల హృదయాలలో ఇప్పటికీ చిరంజీవిగా జీవిస్తున్న భగత్ సింగ్ పేరు తెలియని వారుండరు. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ అభిప్రాయం ప్రకారం భగత్ సింగ్ భారతదేశంలో ‘ఆరంభ మార్కిస్టు భగత్ సింగ్’ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. 

ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌ లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల కలిసి లాహోర్ కాన్సిప్పిరెన్సీలో భాగంగా కేస్ లాహోర్ సెంట్రల్ అంసెబ్లీ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించిన భాగంలో అప్పటి బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు భగత్ సింగ్ అతడి సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో ఉరి తీశారు.

ఈ వార్త అప్పట్లో దావాలనంలా భారత జాతిని ఉద్వేగబరిచిన సందర్భంలో ఎన్నో ఉద్యమానాలు జరిగాయి. భగత్ సింగ్ త్యాగాల గురించి అనేక రచనలు సినిమాలు కూడ వచ్చాయి. ఆనాటి చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారం మహాత్మాగాంధీ భగత్ సింగ్ ‘ఉరి’ ని నిలిపివేయమని ఒక్కమాట ఆనాటి బ్రిటీష్ వైస్రాయ్ జనరల్ కు చెప్పి ఉంటే భగత్ సింగ్ – రాజ్ గురు – సుఖ్ దేవ్ ల ప్రాణాలు నిలిచి ఉండేవని అంటారు. అయితే తాను నమ్మిన అహింసా సిద్దాంతం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహాత్మాగాంధీ భగత్ సింగ్ పట్ల అభిమానం ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం భగత్ సింగ్ ను కాపాడలేకపోయాడు అన్న విమర్శలు ఇప్పటికీ మహాత్మాగాంధీ జీవితంలో చరగని మచ్చగా మిగిలిపోయింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: