ప్రస్తుతం అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ తన ‘జనసేన’ ను ప్రజలకు అత్యంత సన్నిహితంగా చేయాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరలో రైతులతో ‘అమరావతి మార్చ్’ పేరుతో ఒక ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ తన ఆలోచనలు ఇంకా అమలుపరచాకుండానే రేణు దేశాయ్ మరొక విధంగా పవన్ అడుగుజాడలను అనుసరిస్తోంది.
Renu Desai
ప్రస్తుతం అమెరికాలో తనకు కాబోయే భర్తతో కాలం గడుపుతున్న రేణు దేశాయ్ త్వరలో ఇండియాకు తిరిగి వచ్చి ఒక తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను హైలెట్ చేస్తూ ఒక సామాజిక కోణంలో ఈమూవీ ఉంటుందని అంటున్నారు. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఒక స్క్రిప్ట్ ను పూర్తి చేసిన రేణు దేశాయ్ ఈమూవీని ఆమె స్వయంగా నిర్మిస్తుందట. దీనికోసం రేణు ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో కొన్ని రోజులు ఉండి అక్కడి రైతుల సమస్యలను తెలుసుకుని ఆసమస్యలు అన్నింటిని రేణు తాను తీయబోయే సినిమాలో చూపెడుతుందని అంటున్నారు.
renu desai
ఇప్పటికే ఈమె మరాఠీ భాషలో ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను స్వయంగా తీసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆసినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా తిరిగి మరొక సినిమాను తీయడమే కాకుండా దర్శకత్వం వహించడంతోపాటు ఏకంగా పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా రేణు ప్రస్తుతం ఈసినిమాను తీస్తూ ఉండటంతో ఈమె మళ్ళీ యూటర్న్ తీసుకుని పవన్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వెస్తోందా అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: