గతంలో రామ్ చరణ్ మహేష్‌ సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. అనేకసార్లు వీరిద్దరి సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే మారిన పరిస్థుతుల నేపధ్యంలో ఇప్పుడు వీరిద్దరూ స్నేహితులుగా మారిపోవడమే కాకుండా వీరి భార్యల మధ్య కూడ స్నేహం పెరగడం ఓపెన్ సీక్రెట్. 
Koratala Siva's next Mahesh Babu Replaces Ramcharan
దీనితో వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలిసి పార్టీలు చేసుకుంటూ ఆఫోటోలను మీడియాకు షేర్ చేస్తూ వారిద్దరి మధ్యా పెరుగుతున్న సన్నిహిత్యాన్ని అందరికీ తెలిసి వచ్చేలా చేస్తునారు. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ కు చరణ్ వ్యూహాలకు సంబంధించిన ఒక కీలక విషయమై సమాచారం రాబట్టే పరిస్థుతులు ఏర్పడ్డాయి అన్న ప్రచారం జరుగుతోంది. 
Yevadu-1: Nenokkadine
మహేష్ వంశీ పైడిపల్లిల ‘మహర్షి’ మూవీకి సంబంధించిన టీజర్ కు  అనూహ్య స్పందన రావడంతో ఈమూవీ మొదటి పరీక్షలో నెగ్గింది. వచ్చే ఏడాది ఏప్రియల్ 5వ తారీఖున ఉగాది పండుగ రోజున సమ్మర్ రేస్ ను ప్రారంభిస్తూ ‘మహర్షి’ ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు  రామ్ చరణ్‌ దృష్టి కూడ ఏప్రియల్ నెల పై ఉందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ ను ఏప్రియల్ లో విడుదల చేయాలని మెగా కాంపౌండ్ గట్టిప్రయత్నాలు చేస్తోంది. ఈవార్తలే నిజం అయితే ఒకే నెలలో విడుదలకాబోయే ‘మహర్షి’ ‘సైరా’ ల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. 
Ram Charan,Rangasthalam,Ram Charan Rangasthalam
ఇలాంటి పరిస్థుతులలో ఒక నెలలోనే తన ‘మహర్షి’ ని చిరంజీవి ‘సైరా’ తో పోటీగా విడుదల చేయడానికి మహేష్ కు ఇష్టం లేదు అని టాక్. గతంలో ‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ ల మధ్య ఒకే నెలలో విడుదల అయ్యే పరిస్థుతులు ఏర్పడినప్పుడు మహేష్ తనంతట తానుగా ఒక నెల వెనక్కు తగ్గి అనవసర పోటీని నివారిమ్చాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పోటీ ఏర్పడుతుంది అన్న సంకేతాలు వస్తున్న నేపధ్యంలో మహేష్ కోసం చరణ్ సద్దుకుంటాడ లేదంటే చరణ్ కోసం మహేష్ వెనక్కు తగ్గుతాడా అన్న ఆసక్తి పెరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు వెనక్కు తగ్గి మే నెలకు వెళ్ళినా వారికి ‘సాహో’ తో తలనొప్పులు ఖాయం. ఈపరిస్తుతులలో ఈ ఇద్దరి ఆలోచనల స్ట్రాటజీ పై అందరిలో ఆసక్తి పెరుగుతోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: