ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ అవుతున్నాయన్నదానికి మరో రుజువు ‘ఆర్ ఎక్స్ 100’. కొత్త దర్శకుడు, కొత్త నటులతో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది.  మొదట్లో ఈ చిత్రం బూతు కంటెంట్ గా భావించారు..కానీ రాను రాను థియేటర్లో ఈ చిత్రం కలెక్షన్లు దుమ్మురేపడంతో దర్శకుడు  అంతిమ విజేతగా నిలిచాడు. ఇంతకీ ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరో తెలుసా.. అజయ్ భూపతి. కేవలం రూ.3 కోట్లతో నిర్మించిన ఈ మూవీ నాలుగు రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది.

వర్మ శిఘ్యుడిగా ఇంటెన్సివ్ అండ్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీతో గ్రామస్థాయి పాలిటిక్స్, గ్రామాల్లో ప్రేమికుల మధ్య ఉండే నాటు సరసం, భావోద్వేగాలను దర్శకుడు ‘ఆర్ ఎక్స్ 100’చిత్రంతో ఒడిసిపట్టుకోవడంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.  మహానటి తర్వాత ఎన్నో చిత్రాలు రిలీజ్ అయ్యాయి..కానీ ఏది కూడా పెద్దగా విజయం సాధించలేదు. 

అలాంటి సమయంలో ‘ఆర్ ఎక్స్ 100’రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధించి మరోసారి చిన్నచిత్రాల స్థాయిని పెంచింది.  లాంగ్ రన్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ..రూ.11 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది.  తన జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా చేసుకొని కథ రాసుకున్న దర్శకుడు అజయ్ భూపతి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
Image result for rx 100 movie
 ఇంత మంచి విజయం సాధించి పెట్టినందకు నిర్మాత అశోక్ ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడైన అజయ్ భూపతికి విలువైన బహుమతిని అందచేశారు. రూ. 16 లక్షల విలువైన జీప్ కాంపస్ కారును బహుకరించాడు.  కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాంఖీ, రావు రమేష్‌లు కీలకపాత్రల్లో నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: