తండ్రి కొడుకుల ఎమోషనల్ అనుబంధం పై ఎన్నో సినిమాలు అక్కినేని ఎన్టీఆర్ ల కాలం నుండి వస్తూనే ఉన్నాయి. ఈ బంధంను కథాంశంగా మార్చి తీసిన సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. దీనితో ఈ ఎమోషనల్ జోనర్ తో సినిమాలు తీయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
mahesh babu maharshi movie first look is out
మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా ఒక రికార్డ్ క్రియేట్ చేయడానికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ మూవీ కూడ తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని హైలెట్ చేసే కథ అనే లీకులు వస్తున్నాయి. ఈసినిమా టైటిల్ ‘మహర్షి’ అని ప్రకటించడంతో పాటు ‘జాయిన్ ది జర్నీ ఆఫ్ రిషి’ అని ట్యాగ్ లైన్ ఇవ్వడంతో ఈమూవీలో మహేష్ పాత్ర పేరు మహర్షి అయితే అందరూ రిషీ అని పిలుస్తూ ఉంటారు అని భావించారు అంతా. 

అయితే ఈసినిమాలో మహర్షి వేరు రిషి వేరు అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో రిషి పాత్ర పోషిస్తున్న మహేష్ తండ్రి పాత్ర పేరు మహర్షి అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మహర్షి రిషిల పాత్రల మధ్య నడిచే సంఘర్షణ కథాంశంగా మహేష్ ‘మహర్షి’ సినిమా ఉంటుందని లీకులు వస్తున్నాయి. గతంలో మహేష్ తండ్రి కొడుకుల అనుబంధం పై తీసిన చాల సినిమాలలో నటించినా ఈమూవీలోని తండ్రి కొడుకుల అనుబంధానికి సంబంధించిన సీన్స్ ఈమూవీకి హైలెట్ అవుతాయి అని అంటున్నారు. 
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
ఈసినిమాలో మహేష్ పాత్ర అక్కడక్కడ ‘ఆగడు’ సినిమాలో మహేష్ నటించినట్లుగా   సెటైరికల్ డైలాగ్స్ తో ఇంటర్వెల్ పార్ట్ వరకు ఉంటే ఈమూవీ ఇంటర్వెల్ పార్ట్ తరువాత సీరియస్ టర్న్ తీసుకుని ఎమోషన్స్ తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా ఒక విధమైన సామాజిక స్పూర్తితో ఒక సందేశం ఇచ్చే విధంగా ఈసినిమా కథను వంశీ పైడిపల్లి డిజైన్ చేసినట్లు టాక్. వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో వచ్చే ఉగాది పండుగ రోజున విడుదల కాబోతున్న ఈమూవీలో మహేష్ అభిమానులు కూడ ఊహించని అనేక ట్విస్ట్ లు కూడ ఉంటాయని సమాచారం..    


మరింత సమాచారం తెలుసుకోండి: