ఈ మద్య కాలంలో చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్య ఒక్కటే..పైరసీ. సాధారణంగా ఈ పైరసీ చిత్రం రిలీజ్ అయిన కొన్ని గంటల్లో మార్కెట్ లోకి వస్తున్న విషయం చూస్తున్నాం.  కానీ ఈ మద్య మరీ దారుణంగా చిత్రం రిలీజ్ కాకుండానే లీకేజ్ కావడంతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.  కోట్లు వెచ్చించి ఎంతో కష్టపడి తీసిన చిత్రాలు థియేటర్లో కన్నా ముందే యూట్యూబ్ లో కనిపిస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు.  తాజాగా విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం చిత్రం లీక్ కావడంతో పెను సంచలనాలకు దారి తీసింది. 
Image result for విజయ్ సర్కార్ లీక్
తాజాగా ఇదే పరిస్థితి ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ కి కూడా వచ్చింది.  విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ సినిమా పాటకు సంబంధించి 21 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.  అమెరికాలోని లాస్‌వేగాస్‌లో చిత్రీకరించిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియాగ్రఫీ అందించారు. ఇందులో విదేశీ డ్యాన్సర్లు కూడా చిందేశారు.
Image result for విజయ్ సర్కార్ లీక్
తమిళ రాజకీయ నేత కళ కరుప్పయ్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సన్‌పిక్చర్స్‌ సంస్థ‌ నిర్మిస్తున్న ‘సర్కార్‌’కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  పక్కా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదటి నుండి వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: