గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున నానీతో కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. చాల కాలం తరువాత నాగార్జున ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 nagarjuna doing soggade chinninayana movie sequel!
ఈ సినిమాల తరువాత నాగ్ కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా ‘బంగారు రాజు’ చేయబోతున్నాడు. చాల బజీగా ఉన్న నాగార్జున ఇప్పుడు హఠాత్ గా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేసిన ‘మన్మధుడు 2’ టైటిల్ ఎవరికోసం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 
Nagarjuna Then And Now
వాస్తవానికి దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన ‘మనమ్మధుడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్. దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వం హించిన ఈసినిమాకు అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసాడు. అయితే ఆసినిమాకు ఇప్పుడు సీక్వెల్ ఏమిటో ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. 
Nagarjuna
‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్ తో ఒక సినిమా ఉంటుంది అని ఇప్పటికే నాగార్జున ప్రకటించిన నేపధ్యంలో ఈ సినిమా నాగార్జున చైతన్య రాహుల్ కాంబినేషన్ లో వస్తుందా ? లేదంటే అకిల్ ను అక్కినేని కుటుంబ అందగాడుగా పరిగణిస్తారు కాబట్టి అఖిల్ తో ఈ ‘మనమ్మధుడు 2’ ఉంటుందా అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈవిషయం పై క్లారిటీ లేకపోయినా ఎవరో ఒక అక్కినేని యంగ్ హీరో ‘మనమ్మధుడు 2’ గా కనిపించడం ఖాయం అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: