తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీడేస్’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా తర్వాత తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో నటించింది.  తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా హిట్స్ లేకపోవడంతో తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా నటించడం మొదలు పెట్టింది.  అయితే అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు సాధించలేక పోయింది.  దాంతో స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ..మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. 
Image result for baahubali 2 tamanna
ఇక బాహుబలి, బాహుబలి 2 లో నటించిన తమన్నాకు ఒకరకంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటీ రెండు చిత్రాల్లో నటిస్తున్న తమన్నా..తాజాగా కన్నడలో తమ్మూ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది.  దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ తనకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. 
Image result for tamanna items song
తనకు మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని..తనలోని డ్యాన్స్ ప్రతిభను నిరూపించుకోవడానికి ఐటమ్ సాంగ్స్ బాగా సపోర్ట్ చేస్తాయని అంటుంది.  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్ల పైనే అయినా.. తొలి రోజుల్లో ఎలా కనిపించేదో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది.  మంచి ఫిట్ నెస్ తో ఉన్న తమన్నా ఇంకా కుర్ర హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం తమన్నా ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఎఫ్‌2’ చిత్రాల్లో నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: