ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణ క్రిష్ లు అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈమూవీకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు రావాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీకి వివిధ భాషలకు చెందిన నటీనటులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ బ్యూటీలను కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం చేస్తున్నారు. 
Rasi Khanna with her father selfie
ఇప్పటికే ఈమూవీలో శ్రీదేవిగా రకుల్ ప్ర్రీత్ సింగ్ ఎంపిక అయిన నేపధ్యంలో ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన జయప్రద పాత్ర కోసం రాశీ ఖన్నాను కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాటను బాలయ్య రాశి ఖన్నా లపై చిత్రీకరించడానికి క్రిష్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు
అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి క్యారెక్టర్ స్థాయిలో జయప్రద క్యారెక్టర్ ఉండదని అంటున్నారు. దీనితో ఇలాంటి చిన్న పాత్రలో తాను కనిపించాల వద్దా అన్న సందిగ్ధధంలో రాశి ఖన్నా ఉన్నట్లు టాక్. దీనికితోడు ఎన్టీఆర్ తో అనేక సినిమాలలో నటించిన జయసుధ పాత్ర కోసం అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేను కాంటాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. 
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు
ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన పోస్టర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లుక్ పరంగా బాలయ్యను ఎన్టీఆర్ గా మార్చడానికి చేసిన ప్రయత్నాలలో క్రిష్ బాలయ్య నోరు దగ్గర మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఎన్టీఆర్ పెదవుల లుక్ కు బాలకృష్ణ పెదవుల లుక్ కు చాల వ్యత్యాసం కనిపిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈమూవీకి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా నందమూరి అభిమానులతో పాటు మీడియా వర్గాలు హడావిడి చేస్తున్నా ఈ బయోపిక్ కు సంబంధించిన వార్తల పై సోషల్ మీడియాలో ఇప్పటికీ క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈమూవీకి ఎంత వరకు నేటి తరం యూత్ కనెక్ట్ అవుతారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: