భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఈ నెల 10 ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కమల్ హాసన్ సినీ రంగంలో ఎంతో గొప్పగా రాణించినా వైవాహిక విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సారిక ను పెళ్లి చేసుకున్నారు.  వీరికి పుట్టిన ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్.  కొంత కాలం తర్వాత సారికకు దూరమైన కమల్ హాసన్ నటి గౌతమితో దాదాపు పదమూడు సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. 

ఆ మద్య కొన్ని బేధాభిప్రాయాలతో వీరిద్దరూ విడిపోయారు.  ప్రస్తుతం తన కూతుళ్లతో ఉంటున్నారు కమల్ హాసన్.  ఇక శృతి హాసన్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.  సింగర్, మ్యూజిషియన్ అయిన శృతి హాసన్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. రెండో కూతురు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది.  ఆ మద్య అజిత్ నటించిన వివేగం చిత్రంతో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది.  ఈ మద్య కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న కూతుళ్ల‌ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. 
Related image
అయితే భారత దేశంలో గత కొంత కాలంగా మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు, అత్యాచార ఘ‌ట‌నల గురించి విన్న‌ప్పుడు ఓ తండ్రిగా బాధ‌ప‌డుతుంటా. అంత‌మాత్రం చేత వారి స్వేచ్ఛ‌ను లాక్కోలేం. వారు స్వేచ్ఛ‌గా, ధైర్యంగా బ‌త‌క‌డం అలవాటు చేసుకోవాలి. ఈ ప్ర‌పంచంలో ఏమి జ‌రిగినా ఎదుర్కోవ‌డానికి నా కూతుళ్లు సిద్ధంగా ఉన్నారు. నిర్మాత‌ల‌తో త‌న పారితోషికం గురించి శృతి మాట్లాడుతున్న‌ప్పుడు చాలా సంతోషంగా ఉంటుంద‌ ని క‌మ‌ల్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: