పూనమ్ కౌర్ సినిమా కెరియర్ ముగిసిపోయి చాలా సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు ఈమెకు వరసపెట్టి వస్తున్న అవకాశాలు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. కొంతకాలం క్రితం ఆమె పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా అంతర్లీనంగా పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆకామెంట్స్ కు పవన్ అభిమానుల నుంచి పూనమ్ కు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. 
Poonam Kaur
అయితే ఆవిషయం ముగిసిపోయిన తరువాత ఆమెకు వస్తున్న అవకాశాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బుల్లితెర పై ప్రసారం అవుతున్న భారీ సీరియల్ ‘స్వర్ణ ఖడ్గం’ లో ఈమె కీలక పాత్ర చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ఈమధ్య ఈమె ‘శ్రీనివాస కళ్యాణం’ లో ఒక కీలక పాత్ర చేసింది.
Nithin Srinivasa Kalyanam Release Date - Sakshi
పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా నితిన్ నటిస్తున్న ఈసినిమాలో పూనమ్ కు అవకాసం లభించడం వెనుక ఎదో ఒక అజ్ఞాత శక్తి ఉంది అంటూ వార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా పూనమ్ ను ‘సైరా’ లో ఒక కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈమూవీలో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పాత్రను చేస్తున్న చిరంజీవికి ఆపాత్ర స్వభావం రీత్యా నలుగురు భార్యలు ఉన్న పాత్రగా చరిత్ర ప్రకారం చూపించవలసి వస్తోంది. 

ఇప్పటికే నయనతారను ఒక భార్యగా ఎంపిక చేయగా మరోక భార్య పాత్ర కోసం ఒకప్పుడు చిరంజీవితో నటించిన గ్లామర్ బ్యూటీ రంభను అనుకున్నారు. అయితే ఆమె మరొకసారి గర్భిణి అయిన నేపధ్యంలో రంభ స్థానంలో ఇప్పుడు పూనమ్ ను ఎంపిక చేసారు అన్న వార్తలు సందడి చేస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా పూనమ్ కు మెగా కాంపౌండ్ ఇవ్వబోతున్న సపోర్ట్ పై ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: