తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో నాని ఫ్రెండ్ గా నటించాడు.   ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారే స్టార్ డమ్ సంపాదించాడు.  మినిమం గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు. 
Image result for mahanati samantha vijay
తాజాగా పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘గీతాగోవిందం’మంచి హిట్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు కూడా బాగా రాబడుతుంది.  తన కెరీర్ లో మూడో సూపర్ హిట్ ను సాధించిన ఆనందంలో ఉన్న విజయ్ దేవరకొండ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Image result for vijay devarakonda geetha govindam photos
  "నా ఫేవరేట్‌ సమంతతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నా" అంటూ సమంత ముఖ చిత్రం ఉన్న ఓ కాకరపూవొత్తుల పెట్టె ఫొటోను షేర్ చేసుకున్నాడు.  వీరిద్దరు కలిసి ‘మహానటి’ లో నటించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ పోస్ట్ కి సమంత కూడా రిప్లై ఇచ్చింది.  "నీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని బదులిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: