ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘బంగారు కోడిపెట్ట ఎక్కడండీ..’అంటూ పాటలో ఊర్రూతలూగించిన నటి డిస్కోశాంతి.  డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన డిస్కోశాంతి తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. అదే సమయంలో రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇక పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న డిస్కోశాంతి ఆమె భర్త శ్రీహరి మరణం తర్వాత ఎంతో కుంగిపోయారు.  ప్రస్తుతం  తన పిల్లల కెరీర్ కోసం ఆమె ఇండస్ట్రీతో టచ్ లో ఉంటున్నారు.  

Image result for sri reddy protest

తాజాగా ఓ ఇంటర్వ్యూలో  కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.   గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వేధిస్తోంది. కాస్టింగ్ కౌచ్ విషయాన్ని ప్రస్తావిస్తూ నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, మహిళా వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు మహిళలు ఊరుకుంటే అనార్థాలు జరుగుతాయి..అదే ఎదిరిస్తే ఆ తప్పు జరగకుండా ఆపగలుగుతారు. 
Image result for disco shanthi srihari
శ్రీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మగాడు వచ్చి అడిగితే కుదరదని చెప్పాలి. నువ్వు ఎందుకు ఓకె చెప్పావు. మగాడు బలవంతంగా తీసుకునిపోతే నేరం..బలవంతంగా నీపై అత్యాచారం చేస్తే దానికి శిక్షలు ఉన్నాయి..కానీ నీకు నువ్వుగా వారితో ఇష్టపడి వెళ్లిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని వాదించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. అంతా జరిగాక అందరిని నిందిస్తూ మాట్లాడకూడదు.

బహుశా మీడియాలో హైలైట్ కావాలని అలా చేసి ఉండవచ్చు అంటూ డిస్కో శాంతి శ్రీరెడ్డికి చురకలు అంటించారు.  నా కెరీర్ లో నాకు ఎప్పుడు అలాంటి అనుభవాలు జరగలేదే..ఇండస్ట్రీలో నేనేంటో అందరికీ తెలుసు..అయినా ఎవరైనా నన్ను అలా అడిగి ఉంటే..అక్కడే చంపేసేదాన్ని అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారికీ తాను గౌరవం ఇవ్వనని, బూతులే మాట్లాడతానని డిస్కో శాంతి ఘాటుగా వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: