ప్రస్తుతం వెన్నెల కిషోర్ క్రేజ్ ను పరిశీలిస్తున్నవారు త్వరలో ఇతడు టాలీవుడ్ టాప్ కమెడియన్ గా మారడం ఖాయం అని అంటున్నారు. బ్రహ్మానందం అలీ ఇలా చాలామంది సీనియర్ కమెడియన్స్ నెమ్మదిగా కనుమరుగు అయిపోవడంతో పాటు కమెడియన్ పృధ్వీ నటన రొటీన్ గా మారడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి వెన్నెల కిశోర్ తప్పించి మరో ఆప్షన్ లేకుండా పోయింది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య ఈ కమెడియన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడమే కాకుండా సినిమాలో ప్రేక్షకులను నవ్వించే క్రెడిట్ తన భుజాన వేసుకుని ఆసినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈమధ్య విడుదలైన ‘చి.ల‌.సౌ’ ‘గూఢ‌చారి’ సక్సస్ లో వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర వహించాడు. 

‘గీత గోవిందం’ లో అయితే ఇక చ‌ప్ప‌క్క‌ర్లెద్దు క్లైమాక్స్ ముందొచ్చి విజృంభించేశాడు. ఈ సినిమా ఇంత ప్ల‌జెంట్ గా సూపర్ హిట్ కావడానికి విజయ్ దేవరకొండతో పాటుగా సమానంగా వెన్నెల కిషోర్ కి మార్కులు పడుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈనెల ఆఖరున రాబోతున్న `శైల‌జా రెడ్డి అల్లుడు` సినిమాలోనూ వెన్నెల కిషోర్ కామెడీనే ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ని ఇండస్ట్రీ వర్గాల స‌మాచారం. ఈ సినిమాలో చివ‌ర్లో కాకుండా మొద‌ట్నుంచీ నాగ‌చైత‌న్య ప‌క్క‌నే ఉంటూ వెన్నెల కిషోర్ సెటైర్లు వేస్తాడ‌ట‌. 
Naga Chaitanya,Telugu remake of 2 States,Samantha Ruth Prabhu
చైతూకి పెద్ద‌గా కామెడీ చేయ‌లేడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికితోడు ఈ అక్కినేని యంగ్ హీరోకి నాని - విజ‌య్ దేవ‌ర‌కొండ‌లా కామెడీ టైమింగ్ లేదు. అందుకే మారుతి ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ని వాడుకున్నాడ‌ట‌. నాగ‌చైత‌న్య క‌నిపించే ప్ర‌తీ సీన్‌లోనూ వెన్నెల కిషోర్‌నీ ప‌క్క‌న ఉంచి ఈసినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా మారుతి డిజైన్ చేసినట్లు టాక్. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాకు చైతన్యతో సమానంగా వెన్నెల కిషోర్ ఒక మూల‌స్థంభంగా నిల‌వ‌బోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. దీనికితోడు కిషోర్ బాగా న‌వ్వించిన సినిమాల‌న్నీ హిట్ అనే పాజిటివ్ సెంటిమెంట్ కూడ తోడవ్వడంతో  ‘శైల‌జా రెడ్డి అల్లుడి’ కి అన్ని విషయాలు బాగా కలిసి వస్తున్నాయి అంటూ ఈమూవీపై కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: