‘గీత గోవిందం’ సక్సస్ మీట్ కి అతిధిగా వచ్చిన చిరంజీవి విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ వేసిన జోక్స్ నిన్నటి ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ తెగ నవ్వు తెప్పించాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ స్టామినా గురించి చిరంజీవి మాట్లాడుతూ విజయ్ ‘అర్జున్ రెడ్డి’ లో అన్నట్లుగా ‘ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్' అన్న డైలాగ్ తాను అనలేనని ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ అన్నట్లుగా ‘మేడమ్ మేడమ్ నీ కాళ్లు పట్టుకుంటా మేడమ్’ అంటూ నవ్వు తెప్పించిన డైలాగ్ ను కూడ తాను అనలేను అని అంటూ 150 సినిమాలలో నటించిన తనకే విజయ్ దేవరకొండ డైలాగ్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు చిరంజీవి.
ఈ ఫంక్షన్ మాదా? విజయ్ దేవరకొండదా
‘సైరా’ షూటింగులో తీరిక లేకుండా ఉంటున్న ‘గీత గోవిందం’ మ్యానియా విని ఒక రోజు షూటింగ్ ఆపుకుని మరీ ఈ వేడుకకు వచ్చాను అంటూ మెగాస్టార్ తన సెన్సేషనల్ స్పీచ్‌తో అభిమానులతో విజిల్స్ వేయించాడు. అంతేకాదు తాను చాలా సినిమా ఫంక్షన్స్ కు వెళ్లానని అయితే ఈ ఫంక్షన్ లో చూస్తున్న వైబ్రేష‌న్స్ ఈమధ్య కాలంలో తాను ఏఫంక్షన్ లోను చూడలేదు అంటూ కామెంట్స్ చేసాడు. 
ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు ఎప్పుడూ కృత‌జ్ఞులై ఉంటాం
దీనితో జనం విజిల్స్ వేస్తున్నది తనను చూసా లేక విజయ్ దేవరకొండను చూసా అన్న విషయం తనకు అర్ధం కావడం లేదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు చిరంజీవి. ఇలాంటి పరిస్థుతులు చూస్తుంటే సినిమా బావుందంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తేడా లేకుండా ప్రేక్షకులు ఒకేలా ఆదరిస్తున్నారు అంటూ ప్రేక్షకులలో వచ్చిన మార్పును గుర్తించాడు చిరంజీవి. 
విజయ్ స్టార్ హీరో అయ్యాడు
ఈ సినిమాతో విజ‌య్‌ కి వచ్చిన స్టార్ స్టేట‌స్ గురించి మాట్లాడుతూ తాను 30 సినిమాలు చేసిన తరువాత నటించిన ‘ఖైదీ’ తనకు స్టార్ స్టేట‌స్ ఇస్తే కేవలం 3 సినిమాలతో స్టార్ గా మారిపోయిన విజయ్ అదృష్టం వెనుక ఉన్న అతని సమర్థత తనను ఆశ్చర్య పరుస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో స్టార్ హీరోల క్లబ్ లోకి విజయ్ దేవరకొండను ఆహ్వానిస్తున్నాను అంటూ ఇండస్ట్రీ పెద్దన్నగా చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: