ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్, వైఎస్సార్ చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి.  తర్వలో మరికొన్ని బయోపిక్ లు తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.  దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా  రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. 

Anushka Shetty

వెండితెరపై అందాల కథానాయికగా .. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను దోచుకున్నారు. అన్నివర్గాల ప్రజలచేత ఆప్యాయంగా 'అమ్మ' అనిపించుకున్నారు. అలాంటి జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి దర్శకులు ఎ.ఎల్. విజయ్ .. ప్రియదర్శన్ .. భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు వున్నారు. భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

అమ్మ పాత్రలో ఐశ్వర్యారాయ్

జయలలిత బయోపిక్ కోసం భారతీ రాజా ఐశ్వర్యరాయ్‌ని, అనుష్కను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే లక్కేనని, కానీ ఆమె కుదరంటే మాత్రం అనుష్కను తీసుకోవాలని భారతీ రాజా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అమ్మ బయోపిక్ ని తామే తెరకెక్కిస్తాం అని ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు.

 దర్శకుల మధ్య పోటీ

 ఇక తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమె స్థానం ప్రత్యేకం. ఇక ఈ సినిమాకి 'పురిచ్చి తలైవి' .. 'అమ్మ' అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.               

మరింత సమాచారం తెలుసుకోండి: